భర్త స్నేహితుడితో అక్రమ సంబంధం... చివరకు

Published : Aug 28, 2020, 07:57 AM ISTUpdated : Aug 28, 2020, 07:59 AM IST
భర్త స్నేహితుడితో అక్రమ సంబంధం... చివరకు

సారాంశం

మూడేళ్ల నుంచి జంగమ్మకు తన భర్త స్నేహితుడైన శివకుమార్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలిసిన జంగయ్య.. భార్యను మందలించడంతో, భర్త అడ్డు తొలగించుకోవాలని శివకుమార్‌తో కలిసి పథకం పన్నింది. 

ఆమెకు 15ఏళ్ల క్రితమే వివాహమైంది. మంచి భర్త, ముత్యాల్లాంటి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారితో ఆనందంగా గడపాల్సిందిపోయి..ఆమె దారి తప్పింది. భర్త ని కాదని మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం భర్తకు తెలిసి సున్నితంగా మందలించినా ఆమెలో మార్పు రాలేదు. కాగా.. భర్త అడ్డుగా ఉన్నాడని అతని ని తొలగించుకోవాలని అనుకుంది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం చింతకుంటపల్లిలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... చింతకుంటపల్లి గ్రామానికి చెందిన జంగయ్య(37)కు కేశంపేటకు చెందిన జంగమ్మ(33)కు 15 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి కూతురు, ఇద్దరు కుమారులున్నారు. అయితే మూడేళ్ల నుంచి జంగమ్మకు తన భర్త స్నేహితుడైన శివకుమార్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలిసిన జంగయ్య.. భార్యను మందలించడంతో, భర్త అడ్డు తొలగించుకోవాలని శివకుమార్‌తో కలిసి పథకం పన్నింది. 

ఈ క్రమంలో ఈ నెల 23న శివకుమార్‌, అతడి మిత్రుడు గణే్‌ష జంగయ్యను ఆటోలో కేశంపేటకు తీసుకెళ్ళి మద్యం తాగించారు. మత్తులో ఉన్న జంగయ్యను పొదల్లోకి లాక్కెళ్లికర్రతో అతని వృషణాలు, తలపై బాది హత్య చేశారు. జంగయ్య బావమరిది చంద్రయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు జంగమ్మను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం తెలిసింది. గురువారం శివకుమార్‌, గణేష్‌, జంగమ్మలను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. 

PREV
click me!

Recommended Stories

Weather Update: ఏపీ, తెలంగాణలో మారిన వాతావరణం.. 15 జిల్లాలకు హై అలర్ట్.. అక్కడ తుపాను గండం
అమరావతిని ఇంచు కూడా కదిలించలేవు జగన్ | CBN Massive Speech | Asianet Telugu