ఏపీ జైళ్లలో కరోనా కలకలం: ఖైదీలకు, జైలు సిబ్బందికి వైరస్... కొత్త వారితోనే తంటా

By Siva KodatiFirst Published Aug 27, 2020, 8:23 PM IST
Highlights

ఏపీ జైళ్లలో కరోనా కలకలం రేపుతోంది. జైలు సిబ్బంది కోవిడ్ బారినపడుతున్నారు. ఇప్పటి వరకు 1375 మంది ఖైదీలు, 241 మంది జైలు సిబ్బందికి వైరస్ సోకింది. 

ఏపీ జైళ్లలో కరోనా కలకలం రేపుతోంది. జైలు సిబ్బంది కోవిడ్ బారినపడుతున్నారు. ఇప్పటి వరకు 1375 మంది ఖైదీలు, 241 మంది జైలు సిబ్బందికి వైరస్ సోకింది. నలుగురు జైలు సిబ్బంది, ఒక ఖైదీ కరోనాకు బలయ్యారు.

కడప సెంట్రల్ జైల్లో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కరోనా బారినపడ్డారు. వైరస్ తీవ్రత దృష్ట్యా కొత్త ఖైదీలను జైళ్ల శాఖ అనుమతించడం లేదు. మద్యం అక్రమ రవాణా పెరుగుతుండటంతో జైళ్లలోకి కొత్త వారిని అనుమతించక తప్పని పరిస్థితి ఏర్పడింది.

కొత్తగా వచ్చిన ఖైదీల కారణంగా జైళ్లలో కరోనా కలకలం రేపుతోంది. వారం వారం జైళ్లలో కరోనా టెస్టులు నిర్వహిస్తోంది సర్కార్. ఇప్పటి వరకు 20 దఫాలుగా ఖైదీలకు పరీక్షలు నిర్వహించింది వైద్య ఆరోగ్య శాఖ. వైరస్ సోకిన ఖైదీలకు పోషకాహారాన్ని అందిస్తోంది జైళ్ల శాఖ.

ఇప్పటి వరకు 380 మంది ఖైదీలు, 95 మంది జైలు సిబ్బంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. మరోవైపు ఏపీలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. వరుసగా రెండో రోజు పది వేలకు పైగా కేసులు వెలుగుచూశాయి.

గత 24 గంటల్లో ( బుధవారం ఉదయం 9 గంటల నుంచి గురువారం ఉదయం 9 గంటల వరకు) 10,621 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,93,090కి చేరింది.

అలాగే గత 24 గంటల్లో వైరస్ కారణంగా 92 మంది మరణించారు. వీటితో కలిపి మొత్తం మృతుల సంఖ్య 3,633కి చేరుకుంది. గత 24 గంటల్లో 61,300 మంది శాంపిల్స్‌ను పరీక్షించారు. దీంతో మొత్తం టెస్టుల సంఖ్య 34,79,990కి చేరుకుంది. 

click me!