తెలంగాణయే బెటర్, 12 పోర్టులున్నా ఏపీని దిగజార్చారు: జగన్‌పై చంద్రబాబు ఫైర్

Siva Kodati |  
Published : Aug 27, 2020, 09:55 PM ISTUpdated : Aug 27, 2020, 09:56 PM IST
తెలంగాణయే బెటర్, 12 పోర్టులున్నా ఏపీని దిగజార్చారు: జగన్‌పై చంద్రబాబు ఫైర్

సారాంశం

నీతి అయోగ్ తాజాగా విడుదల చేసిన జాతీయ ఎగుమతుల సన్నద్ధత సూచీపై టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు స్పందించారు.  

నీతి అయోగ్ తాజాగా విడుదల చేసిన జాతీయ ఎగుమతుల సన్నద్ధత సూచీపై టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు స్పందించారు.  "ఎగుమతుల సన్నద్దత సూచి 2020"లో ఆంధ్రప్రదేశ్ 20వ స్థానంలో ఉండటం విచారకరమన్నారు.

అటు తీర ప్రాంత రాష్ట్రాల జాబితాలో 7వ స్థానంలో నిలిచిందని ఆయన అన్నారు. అతి పొడవైన తీర ప్రాంతం వున్న మన రాష్ట్రం కనీసం 8 తీర ప్రాంత రాష్ట్రాలతో పోటీపడలేక 7వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చిందని చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.

పోర్టులు లేకున్నా తెలంగాణ రాష్ట్రం 6వ స్థానంలో ఉంటే.. ఒక మేజర్ పోర్టు, 11 మైనర్ పోర్టులు ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇలా దిగజారిపోవడం వైసీపీ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ఆయన ఎద్దేవా చేశారు. 

 

 

PREV
click me!

Recommended Stories

Road Doctor: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రోడ్డు డాక్ట‌ర్‌.. దేశం దృష్టిని ఆక‌ర్షిస్తోన్న స‌రికొత్త సేవ‌లు
IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!