కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం... మహిళ మృతి, ఇద్దరి పరిస్థితి విషమం

Published : Dec 11, 2022, 11:53 AM IST
కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం... మహిళ మృతి, ఇద్దరి పరిస్థితి విషమం

సారాంశం

హైదరాబాద్ నుండి కొనసీమ జిల్లా రామచంద్రాపురం వెళుతున్న కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టడంతో ఓ మహిళ మృతిచెందింది. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా ఇద్దరు చిన్నారులు మాత్రం సురక్షితంగా బయటపడ్డారు. 

గన్నవరం : తెలంగాణ రాజధాని హైదరాబాద్ నుండి ఆంధ్ర ప్రదేశ్ లోని రామచంద్రాపురం వెళుతున్న కారు కృష్ణా జిల్లా రోడ్డుప్రమాదానికి గురయ్యింది. అతివేగంతో వెళుతున్న కారు అదుపుతప్పి రోడ్డుపక్కకు దూసుకెళ్లి కల్వర్టును ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఐదురుగురిలో ఓ వృద్దురాలు మృతిచెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరు చిన్నారులు మాత్రం ఈ ప్రమాదం నుండి సురక్షితంగా బయటపడ్డారు. 

కృష్ణా జిల్లా బాపులపాడు మండలం ఉమామహేశ్వరపురం వద్ద ఈ కారు ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు తీవ్రంగా గాయపడినవారితో పాటు చిన్నారులను బయటకు తీసి హాస్పిటల్ కు తరలించారు. గాయపడిన ఇద్దరి పరిస్థితి విషమంగా వుంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. 

Read More కర్ణాటకలో ఘోర రోడ్డుప్రమాదం... నాలుగేళ్ల చిన్నారితో సహా సాప్ట్ వేర్ దంపతుల దుర్మరణం

ఈ ప్రమాదంలో కారు తుక్కుతుక్కయ్యింది. కారు డ్రైవర్ నిద్రమత్తే ఈ ఘోర ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. స్థానిక పోలీసులు ఈ రోడ్డుప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రమాద బాధితుల వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్