శ్రీసత్యసాయి జిల్లాలో విషాదం: ఇంజక్షన్ వికటించి ముగ్గురు మృతి

Published : Dec 11, 2022, 11:37 AM IST
శ్రీసత్యసాయి జిల్లాలో విషాదం: ఇంజక్షన్ వికటించి  ముగ్గురు మృతి

సారాంశం

ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పూలకుంట్లపల్లిలో  నాటు వైద్యం వికటించి  ముగ్గురు మృతి చెదారు.  మోకాళ్ల నొప్పులకు  ఇచ్చిన ఇంజక్షన్ వికటించి  ముగ్గురు మరణించారు. 

అనంతపురం: శ్రీసత్యసాయి హిందూపురం  జిల్లాలో  విషాదం నెలకొంది. జిల్లాలోని  పూలకుంట్లపల్లిలో నాటువైద్యం వికటించి  ముగ్గురు మృతి చెందారు. పూలకుంట్లపల్లిలో  నాటు వైద్యుడు  మోకాళ్ల నొప్పులకు  ఇంజక్షన్ ఇచ్చాడు.ఈ ఇంజక్షన్  వికటించి  శనివారంనాడు ఇద్దరు మృతి చెందారు. ఆదివారం నాడు  మరొకరు మృతి చెందారని  మృతుల కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. 

శ్రీసత్యసాయి జిల్లా ఓబులదేవరచెరువు మండలానికి చెందిన  ఇద్దరు వ్యక్తులు  పూలకుంట్లపల్లి గ్రామంలో నాటు వైద్యుడిని ఆశ్రయించారు. మోకాళ్ల నొప్పుల విషయంలో బాధితులు  ఇద్దరు వ్యక్తులు  నాటు వైద్యుడి వద్ద చికిత్స తీసుకున్నారు.  నాటు వైద్యుడు అందించిన చికిత్స తర్వాత  ఇద్దరు బాధితుల కాళ్లు వాచాయి.  అంతేకాదు బాధితుల అంతర్గత అవయవాలు కూడా దెబ్బతిన్నాయి.  ఈ ఘటనలో  శనివారం నాడు  తుమ్మలకుంటపల్లికి చెందిన పొప్పురమ్మ, బసప్పగారిపల్లికి చెందిన రామప్పలు మరణించారు. ఇవాళ మరొకరు మృతి చెందినట్టుగా స్థానికులు చెప్పారు. 

ఈ విషయమై జిల్లా వైద్యశాఖాధికారులు గ్రామంలో విచారణ నిర్వహిస్తున్నారు. ఈ నాటు వైద్యుడి వద్ద సుమారు  20 మంది వరకు  మోకాళ్ల నొప్పులకు  చికిత్స తీసుకున్నారని సమాచారం. ఈ ఇంజక్షన్ తీసుకున్నవారిలో  అస్వస్థతకు గురైన వారిలో  కొందరు పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.  బత్తలపల్లిలోని ఆర్డీటీ, పులివెందులలోని  ఆసుపత్రుల్లో  బాధితులు చికిత్స పొందుతున్నారు.

PREV
click me!

Recommended Stories

వొళ్ళు గగురు పుట్టే విన్యాసాలతో అదరగొట్టిన పోలీస్ సిబ్బంది | Nara Lokesh | Independence Day | Stunts
ఈ బైకర్ విన్యాసాలకి మంత్రి నారా లోకేష్ ఫిదా | Nara Lokesh Particepate Independence Day Celebrations