లాడ్డిలో రక్తపుమడుగులో ప్రియురాలు.. ఆస్పత్రిలో కత్తిగాట్లతో ప్రియుడు.. మిస్టరీ ఏంటంటే..

By AN Telugu  |  First Published Oct 26, 2021, 7:54 AM IST

నాగచైతన్య ఉద్యోగం వదిలి హైదరాబాద్ వెళ్లి అక్కడే ఓ hospitalలో పని చేస్తోంది. కోటిరెడ్డి ఈ నెల 22న హైదరాబాద్ కు వెళ్లి ఆమెను కలిశాడు. ఆ తర్వాత ఇద్దరూ ఒక Lodgeలో గది అద్దెకు తీసుకున్నారు. 23 వ తేదీ రాత్రి నాగచైతన్య లాడ్జి గదిలోని murderకు గురైంది. కోటిరెడ్డి మాత్రం అదృశ్యమయ్యాడు.


ఒంగోలు :  వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. కలిసి జీవితప్రయాణం చేయాలనుకున్నారు. దీనికోసం తల్లిదండ్రులను కూడా కాదనుకున్నారు.. అయితే ఓ ట్విస్ట్ వారి పండంటి జీవితాన్ని నాశనం చేసింది. అసలేం జరిగిందో మిస్టరీగా మారింది. 

కోటి ఆశలతో కొత్త జీవితం కోసం ఎదురు చూస్తున్న యువతి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. అదే గదిలో ఆమెతో పాటే ఉండాల్సిన యువకుడు పక్కరాష్ట్రంలోని ఓ ఆస్పత్రిలో తేలాడు. అది కూడా ఒంటిమీద కత్తి గాట్లతో.. ప్రశ్నించినవారికి.. అంతు పొసగని సమాధానాలు చెబుతున్నాడు. 

Latest Videos

undefined

ఆమె పేరు నాగచైతన్య ఒంగోలు సమీప గ్రామ నివాసి.  నగరంలో ఒక ప్రైవేటు వైద్యశాలలో నర్సు గా పనిచేస్తుంది.  అతని పేరు  గాదే కోటిరెడ్డి.  గుంటూరు జిల్లా వాసి. ఇంజనీరింగ్ పూర్తి చేశాడు.  Medical Representative పని చేస్తున్నాడు. తరచూ వైద్యశాలకు వెళ్లే క్రమంలో నాగచైతన్య తో పరిచయం ఏర్పడింది.

అది కాస్త ప్రేమగా మారింది. ఇద్దరు Marriage చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అమ్మాయి తల్లి చిన్నతనంలోనే కన్నుమూయడం, తండ్రి కూడా కొన్నాళ్ళ కిందట కాలం చేయడంతో.. సవతి తల్లి మాత్రమే ఉంది.  ఇద్దరి సామాజిక వర్గాలు వేరు కావడంతో యువకుడి కుటుంబీకులు పెళ్లికి అంగీకరించలేదు. దీంతో నాగచైతన్య ఉద్యోగం వదిలి హైదరాబాద్ వెళ్లి అక్కడే ఓ hospitalలో పని చేస్తోంది. 

కోటిరెడ్డి ఈ నెల 22న హైదరాబాద్ కు వెళ్లి ఆమెను కలిశాడు. ఆ తర్వాత ఇద్దరూ ఒక Lodgeలో గది అద్దెకు తీసుకున్నారు. 23 వ తేదీ రాత్రి నాగచైతన్య లాడ్జి గదిలోని murderకు గురైంది. కోటిరెడ్డి మాత్రం అదృశ్యమయ్యాడు.  

ఈ ఉదంతంపై చందానగర్ పోలీస్ స్టేషన్ లో హత్య కేసు నమోదైంది.  హైదరాబాద్ లాడ్జి గది నుంచి  అదృశ్యమైన కోటిరెడ్డి  సోమవారం ఉదయం ఒంగోలు  GGHలో దర్శనమిచ్చాడు.

గుంటూరు: తరగతి గదిలోనే చిన్నారులకు నీలిచిత్రాలు చూపించి... నీచపు టీచర్ వికృతచేష్టలు

 ఒంటి పై Sword stabsతో చికిత్స కోసం చేరాడు.  తమ పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో నాగచైతన్య కత్తితో పొడుచుకుని ఆత్మహత్యాయత్నం చేశామని,  అని తాను అపస్మారక స్థితిలోకి వెళ్లానని ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు అని చెబుతున్నాడు తనను బంధువులు ఎవరూ కాపాడి ఒంగోలు వైద్యశాలలో చేసినట్లు వెల్లడించాడు.

కోటి రెడ్డి కోసం గాలిస్తున్న చందానగర్ పోలీసులు సోమవారం ఒంగోలుకు వచ్చి జీజీహెచ్లో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత హైదరాబాద్ కు తరలించారు. అసలేం జరిగింది.. అనే వివరాలు పోలీసు విచారణలో వెలుగు చూడాల్సి ఉంది. 

కుటుంబాలు ఒప్పుకోలేదని.. చనిపోవాలనుకున్నారా? లేక ఎవరైనా హత్య చేశారా? ఇవి ఆత్మహత్యలేనా? గదిలో ఉండాల్సిన వ్యక్తి ఆస్పత్రికి ఎలా వచ్చాడు? ఆ రాత్రి అసలేం జరిగింది? అనే చిక్కుముడులు వీడాల్సి ఉంది. 

click me!