సకాలంలో చికిత్స అందక విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో మహిళ మృతి...

By SumaBala Bukka  |  First Published May 28, 2022, 11:17 AM IST

విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యంతో ఓ మహిళ మృత్యువాత పడింది. చికిత్స చేయకుండా సెలైన్ పెట్టి వదిలేయడంతో చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.


విజయవాడ : government hospital వైద్యులు సకాలంలో చికిత్స అందించకపోవడంతో కృష్ణవేణి అనే మహిళ మృతి చెందిన ఘటన Vijayawadaలో జరిగింది. నిన్న ఉదయం అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు.  అయితే చికిత్స చేయకుండా ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది కేవలం సెలైన్ పెట్టి చేతులు దులుపుకున్నారని అంటున్నారు. అడిగితే..  సిబ్బంది లేరని తామేమీ చేయలేమని ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని వాపోతున్నారు.

శనివారం పరిస్థితి విషమించడంతో ఐసియుకు తరలించారు. అక్కడ చికిత్స కొనసాగుతుండగా కృష్ణవేణి  మృతి చెందిందని తెలిపారు. వైద్యుల నిర్లక్షం కారణంగానే మృతి చెందిందని ప్రభుత్వ ఆసుపత్రిలో కుటుంబ సభ్యుల ఆందోళన చేపట్టారు. దీనిమీద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Latest Videos

undefined

ఇదిలా ఉండగా, vijayawada నగరంలో వివాహిత మెడా పూర్ణిమా (37) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె మృతికి భర్త వేదింపులే కారణం అని అంటున్నారు. భర్త వేధింపులుకు గురి చేసి హత్య చేశారని తల్లి, తమ్ముడు ఆరోపిస్తున్నారు. అదనపు కట్నం వేధింపులు, పుట్టింటి ఆస్తులు తన పేరుతో రాయాలని చాలా కాలంగా వేధిస్తున్నాడని పూర్ణిమ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

ఈ మేరకు ఇంట్లో వివాదాలు జరుగుతున్న సమయంలోనే అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకున్న స్థితిలో పూర్ణిమా మృతి చెందింది. దీంతో పూర్ణిమది హత్య అని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఉదయం బెంజ్ సర్కిల్ సమీపంలో  నివాసంలో మృతి చెందింది.

ఆమెను తీసుకువచ్చిన సమయంలో ఉదయం ఉరి వేసుకొని చనిపోయిందని ఆసుపత్రికి తీసుకొచ్చిన భర్త జానకి రామయ్య తెలిపాడు. అయితే మృతురాలి ఒంటిమీద గాయాలు ఉండటంతో కుటుంబ సభ్యులు అనుమానంతో పోలీసులకు పిర్యాదు చేశారు.

అయితే ఫిర్యాదు చేసినా.. ఉదయం నుంచి కేసు నమోదు చేయకుండా పోలీసులు  తాత్సారం  చేస్తున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. జానకి రామయ్య ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ లో ఏఈగా విధులు నిర్వహిస్తున్నాడు. 

ఇదిలా ఉండగా, నిరుడు డిసెంబర్ 21న tamilnaduలోని రాణిపేట్ జిల్లాలో విస్మయకర ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి youtube videos చూసి, భార్యకు ఇంట్లోనే delivery procedure చేశాడు.  ఫలితంగా Dead babyని ప్రసవించిన ఆమె over bleedingతో ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతోంది. పోలీసుల వివరాల ప్రకారం... పానపక్కం  ప్రాంతంలో దుకాణం నడుపుతున్న ఓ వ్యక్తికి ఏడాది క్రితం వివాహం అయింది కొన్నాళ్లకు భార్య (28) గర్భం దాల్చింది.

నెలలు నిండడంతో డిసెంబర్ 18న ఆమెకు నొప్పులు మొదలయ్యాయి. అయితే, ఆస్పత్రికి తీసుకెళ్లే బదులు.. ఇంట్లోనే బిడ్డను ప్రసవించేలా చేయాలనుకున్నాడు. ఈ క్రమంలో యూట్యూబ్ వీడియోలు చూడడంతో పాటు, సోదరిని అడిగి తెలుసుకున్నాడు. అయితే, ఇలా చేస్తున్న క్రమంలో చాలా సేపటికి ఆమె ప్రసవించింది. కాగా, బిడ్డ చనిపోయింది. మరోవైపు తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమెను సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. 

పరిస్థితి విషమంగా మారడంతో అక్కడి నుంచి వేలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై జిల్లా వైద్యాధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు ఈ వ్యవహారంపై స్పందిస్తూ.. దీనిపై విచారణ జరుపుతున్నామని.. ఇంకా ఎవరిపై కేసు నమోదు చేయలేదని చెప్పారు. భార్య అనుమతి తోనే అతడు డెలివరీ చేసినట్లు కుటుంబసభ్యులు తెలిపారని వెల్లడించారు. 

click me!