అదనపు కట్నం వేధింపులు.. వివాహిత అనుమానాస్పద మృతి...

By SumaBala BukkaFirst Published May 28, 2022, 10:38 AM IST
Highlights

అదనపు కట్నం వేధింపులు మరో వివాహితను బలి తీసుకున్నాయి. భర్త వేధింపులు తాళలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. అయితే ఒంటిపై గాయాలు ఉండడంతో కుటుంబ సభ్యులు హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. 

విజయవాడ : vijayawada నగరంలో వివాహిత మెడా పూర్ణిమా (37) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె మృతికి భర్త వేదింపులే కారణం అని అంటున్నారు. భర్త వేధింపులుకు గురి చేసి హత్య చేశారని తల్లి, తమ్ముడు ఆరోపిస్తున్నారు. అదనపు కట్నం వేధింపులు, పుట్టింటి ఆస్తులు తన పేరుతో రాయాలని చాలా కాలంగా వేధిస్తున్నాడని పూర్ణిమ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

ఈ మేరకు ఇంట్లో వివాదాలు జరుగుతున్న సమయంలోనే అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకున్న స్థితిలో పూర్ణిమా మృతి చెందింది. దీంతో పూర్ణిమది హత్య అని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఉదయం బెంజ్ సర్కిల్ సమీపంలో  నివాసంలో మృతి చెందింది.

ఆమెను తీసుకువచ్చిన సమయంలో ఉదయం ఉరి వేసుకొని చనిపోయిందని ఆసుపత్రికి తీసుకొచ్చిన భర్త జానకి రామయ్య తెలిపాడు. అయితే మృతురాలి ఒంటిమీద గాయాలు ఉండటంతో కుటుంబ సభ్యులు అనుమానంతో పోలీసులకు పిర్యాదు చేశారు.

అయితే ఫిర్యాదు చేసినా.. ఉదయం నుంచి కేసు నమోదు చేయకుండా పోలీసులు  తాత్సారం  చేస్తున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. జానకి రామయ్య ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ లో ఏఈగా విధులు నిర్వహిస్తున్నాడు. 

ఇదిలా ఉండగా, భీమిలీ  కొమ్మాదిలో 2021, డిసెంబర్ 18న పెళ్లయిన 42 రోజులకే నవ వధువు మృత్యుఒడికి చేరుకుంది. కట్టుకున్న భర్తే కాలయముడిగా మారి కిరాతకంగా చంపేశాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  జీవీఎంసీ నాలుగో వార్డు పుక్కళ్లపాలేనికి చెందిన మైలపిల్లి తగరపువలస వలందపేటకు చెందిన కోనాడ నరసయ్యమ్మ (26)కు 42 రోజుల కిందట marriage జరిగింది. పెళ్లైన వారం రోజులకే హరి అదే వార్డు పరిధి చేపలుప్పాడ సమీపంలోని  గోవుపేటలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని కాపురం పెట్టాడు.  అంతలోనే నరసమ్మ చనిపోయింది. తగరపువలసలో ఉంటున్న తన అన్నయ్య కోనాడ అప్పారావుతో ఆమె రోజు ఫోన్ లో మాట్లాడుతుండేది. రెండు రోజుల నుంచి అప్పారావు ఆమెకు ఫోన్ చేస్తున్నా స్పందించకపోవడంతో అనుమానం వచ్చి.. అతను మధ్యాహ్నం నరసయమ్మ ఇంటికి వచ్చేసరికి తన చెల్లి విగతజీవిగా పడి ఉంది. దీంతో హరిని నిలదీయగా ఎటువంటి సమాధానం చెప్పకపోవడంతో భీమిలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

నరసయమ్మ శుక్రవారం ఉదయమే చనిపోయి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శరీరంపై ఉన్న గాయాలను బట్టి  ఆమెది హత్యగానే పోలీసులు నిర్ధారణకు వచ్చారు. కాళ్లకు తాడు కట్టి ఛాతిపై వాతలు పెట్టి, మెడకు తాడు కట్టి హత్య చేసినట్లు పోలీసుల పరిశీలనలో తేలింది.  సీఐ వెంకటరమణ, ఎస్సై రాంబాబు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

హరికి superstitiousపై ఆసక్తి ఎక్కువ అని, జరిగినది.. జరగబోయేదీ చెబుతాను అంటూ ఏవో మంత్రాలు, తంత్రాలు వంటివి వేస్తాడని స్థానికులు చెబుతున్నారు. అలాగే భార్య విషయంలోనూ అతను ఏదో మూఢనమ్మకం ఉండి ఉంటుందని.. ఆ మూఢనమ్మకాలలో భాగంగానే నరసయ్యమ్మను చిత్రహింసలకు గురిచేసి చంపి ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు. ఆమె మరణం విని తండ్రి దుర్గయ్య విలపించిన తీరు అందరినీ కన్నీళ్లు పెట్టించింది. దుర్గయ్యకు ఇద్దరు కొడుకులు, నలుగురు కూతుళ్లు.  కాగా నరసయమ్మ చివరి కుమార్తె.  ఆయన భార్య గతంలోనే చనిపోయింది. పెళ్లై ఆనందంగా ఉందని భావించిన తన కూతురు ఇలా హత్యకు గురవుతుందని ఊహించలేదని దుర్గయ్య వాపోయాడు. 

click me!