భర్త గుడికి తీసుకువెళ్లలేదని భార్య ఆత్మహత్య..!

Published : May 03, 2021, 07:48 AM IST
భర్త గుడికి తీసుకువెళ్లలేదని భార్య ఆత్మహత్య..!

సారాంశం

కుమార్తె పుట్టినరోజును పురస్కరించుకుని సత్య దేవాలయానికి తీసుకువెళ్లమని భర్తను కోరింది. అందుకు సురేష్‌ నిరాకరించడంతో మనస్తాపానికి గురై ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది

కుమార్తె పుట్టినరోజు సందర్భంగా కుటుంబం మొత్తం గుడికి వెళ్లాలని ఆమె ఆశపడింది. కానీ.. గుడికి తీసుకువెళ్లేందుకు భర్త అంగీకరించలేదు. దీంతో.. మనస్తాపానికి గురై మహిళ బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం బలుసుమూడి ఎస్టీ కాలనీలో దొడ్డా సురేష్‌ భార్య సత్య, ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు. గత నెల 28వ తేదీన వారి కుమార్తె పుట్టినరోజును పురస్కరించుకుని సత్య దేవాలయానికి తీసుకువెళ్లమని భర్తను కోరింది. అందుకు సురేష్‌ నిరాకరించడంతో మనస్తాపానికి గురై ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్సపొందుతూ ఆదివారం మృతిచెందినట్లు  భీమవరం టూటౌన్‌ ఏఎ్‌సఐ ఎఎ్‌సఆర్‌ మూర్తి తెలిపారు. కాగా.. ఆమె మృతితో భర్త, పిల్లలు కన్నీరు మున్నీరుగా విలపించారు. చిన్న విషయానికే ఆమె అంత పెద్ద నిర్ణయం తీసుకోవడం బంధువులను సైతం కలవరపెడుతోంది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్