ఆటోలో ఎక్కిన మూగ బాలికపై డ్రైవర్ సహా మిత్రుడు అత్యాచారం

Published : May 03, 2021, 07:16 AM IST
ఆటోలో ఎక్కిన మూగ బాలికపై డ్రైవర్ సహా మిత్రుడు అత్యాచారం

సారాంశం

తల్లి వద్దకు వెళ్లేందుకు ఆటో ఎక్కిన మూగ బాలికపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేశారు. ఆటో డ్రైవర్ సహా అతని మిత్రుడు ఆ ఘాతుకానికి పాల్పడ్డారు పోలీసులు వారిని అరెస్టు చేశారు.

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం ఏజెన్సీలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ మూగ బాలికపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. విశాఖపట్నం ఏజెన్సీలోని జి. మాడుగుల మండలం పెదలోచలి గ్రామంలో జరిగిన ఆ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

పెదలోచలిలో అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటున్న పదహారేళ్ల మూడు బాలిక ఏప్రిల్ 29వ తేీదన గన్నేరుపుట్టులో ఉన్న తన తల్లి వద్దకు వెళ్లేందుకు ఆటో ఎక్కింది. బాలిక ఒక్కతే ఉండడంతో డ్రైవర్ ఏడుకొండలు (29), అతని మిత్రుడు పి. బాబూరావు (27) ఆటోను దారి మళ్లించారు 

నిర్మానుష్యంగా ఉన్న మద్దులబంద మార్గంలోకి తీసుకుని వెళ్లి అత్యాచారం చేశారు ఆ తర్వాత బాలికను అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. దీంతో మరో ఆటోలో బాలిక తల్లి వద్దకు చేరుకుంది. తనపై జరిగిన అత్యాచారం గురించి మర్నాడు తల్లికి సైగలతో చెప్పింది. 

దాంతో మూగ బాలిక తల్లి స్థానికులతో కలిసి శనివారంనాడు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితులను అరెస్టు చేశారు. 

PREV
click me!

Recommended Stories

నేను మారాను నన్ను నమ్మండి అనడం చంద్రబాబు కి అలవాటే: Perni Nani Comments | YCP | Asianet News Telugu
మాస్క్ అడిగితె చంపేస్తారా? Varla Ramaiah Serious Comments on YS Jagan | Viral | Asianet News Telugu