నెల్లూరులో విషాదం: ఇద్దరు పిల్లలతో సహా వివాహిత ఆత్మహత్య

Published : Sep 01, 2022, 03:49 PM IST
 నెల్లూరులో విషాదం: ఇద్దరు పిల్లలతో సహా వివాహిత ఆత్మహత్య

సారాంశం

 కుటుంబ కలహల నేపథ్యంలో వివాహిత తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. భర్త వేధింపులు తాళలేకే గీత ఆత్మహత్య చేసుకుందని ఈ ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. 

నెల్లూరు: నెల్లూరు జిల్లా వింజమూరులో కుటుంబ కలహాలతో వివాహిత తన ఇద్దరు పిల్లలతో ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నెల్లూరులోని వింజమూరులోని జైభీమ్ కాలనీలో వెంకటరమణయ్య తన భార్య , ఇద్దరు పిల్లలతో నివాసం ఉంటున్నారు. వెంకటరమణయ్య గ్యాస్ గోడౌన్ లో పనిచేస్తున్నాడు.  ఇటీవల కాలంలో భార్యతో వెంకటరమణయ్య గొడవ పడేవాడు. అనుమానంతోనే భార్యతో గొడవకు దిగేవాడని స్థానికులు పోలీసులకు చెప్పారు

ఈ గోడవల కారణంతో మానసికంగా వేదనకు గురైన గీత తన ఇద్దరు పిల్లలతో ఉరేసి చంపేసింది. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. వెంకట్రామయ్య వేధింపుల కారణంగానే గీత తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుందా అఇంకా ఇతరత్రా కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో  పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు చిన్నారులతో సహా గీత ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మరో వైపు మృతదేహలను పోస్టు మార్టం కోసం పోలీసలుు ఆసుపత్రికి తరలించారు.
 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu: జిల్లా కలెక్టర్లే ప్రభుత్వానికిబ్రాండ్ అంబాసిడర్లు: బాబు | Asianet News Telugu
IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే