మల్లాది విష్ణుకి కీలక పదవి.. కేబినెట్ హోదా క‌ల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

By Sumanth KanukulaFirst Published Sep 1, 2022, 3:33 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌ ప్లానింగ్‌ బోర్డ్‌ ఉపాధ్యక్షుడిగా విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు నియమితులయ్యారు.ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ఆయనకు కేబినెట్ హోదా క‌ల్పిస్తూ కూడా ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది.

ఆంధ్రప్రదేశ్‌ ప్లానింగ్‌ బోర్డ్‌ ఉపాధ్యక్షుడిగా విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు నియమితులయ్యారు.ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ఆయనకు కేబినెట్ హోదా క‌ల్పిస్తూ కూడా ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. మల్లాది విష్ణు  రెండేళ్ల పాటు ప్లానింగ్‌ బోర్డు వైస్‌ ఛైర్మన్‌ పదవిలో కొనసాగనున్నారు. కాంగ్రెస్ పార్టీతో రాజకీయాల్లోకి ప్రవేశించిన మల్లాది విష్ణు.. విజయవాడ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తర్వాత ఆయన వైసీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేసిన మల్లాది విష్ణు విజయం సాధించారు. 

అయితే జగన్ మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణ చేసిన సమయంలో మల్లాది విష్ణుకు మంత్రి పదవి దక్కుతుందనే ప్రచారం జరిగినప్పటికీ.. అది వాస్తవ రూపం దాల్చలేదు. ఇక, వైసీపీ అధికారంలో వచ్చిన తర్వాత బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గానికి చెందిన మ‌ల్లాది విష్ణును బ్రాహ్మణ కార్పొరేష‌న్ చైర్మ‌న్‌గా నియమించారు. దాదాపు ఏడాదిన్నర పాటు ఆయన ఆ పదివిలో ఉన్నారు. అయితే తాజాగా ఆయనను ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మ‌న్ ప‌ద‌వి దక్కింది. 
 

click me!