‘హిజ్రాగా మారితే పెళ్లి చేసుకుంటా..’ తీరా మారాక.. నమ్మించి యువతిని మోసం చేసిన మహిళ...

Published : Jul 24, 2021, 10:57 AM IST
‘హిజ్రాగా మారితే పెళ్లి చేసుకుంటా..’ తీరా మారాక.. నమ్మించి యువతిని మోసం చేసిన మహిళ...

సారాంశం

శిక్షణ తీసుకుంటున్న సమయంలో అక్కడే శిక్షణలో ఉన్న ఓ మహిళ పరిచయమయింది. ఇరువురికి వివాహం కాలేదు. మంచి స్నేహితులుగా మారారు. యువతికి అబ్బాయి లక్షణాలున్నాయి. నీవు హిజ్రాగా మారితే వివాహం చేసుకుంటానని పరిచయమైన మహిళ యువతిని బలవంతపెట్టింది.

కడప : హిజ్రాగా మారితే వివాహం చేసుకుంటానని ఓ మహిళ చెప్పడంతో యువతి హిజ్రాగా మారింది. ఇప్పుడు పెళ్లి చేసుకోనంటూ.. మహిళ ముఖం చాటేయడంతో బాధితురాలు న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించింది. వివరాల్లోకి వెడితే.. కడపకు చెందిన ఓ యువతి తండ్రి చనిపోవడంతో ఆమెకు కారణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చారు. 

శిక్షణ తీసుకుంటున్న సమయంలో అక్కడే శిక్షణలో ఉన్న ఓ మహిళ పరిచయమయింది. ఇరువురికి వివాహం కాలేదు. మంచి స్నేహితులుగా మారారు. యువతికి అబ్బాయి లక్షణాలున్నాయి. నీవు హిజ్రాగా మారితే వివాహం చేసుకుంటానని పరిచయమైన మహిళ యువతిని బలవంతపెట్టింది.

ఆమె మాటలు నమ్మిన యువతి హిజ్రాగా మారింది. ఇరువురు కలిసి జీవిస్తున్నారు. ఇప్పుడు పెళ్లి చేసుకోనని మహిళ ముఖం చాటేసింది. వారి ప్రేమను మహిళ తల్లిదండ్రులకు చెప్పడంతో వారు అంగీకరించలేదు. మహిళను నిర్భంధించారు. హిజ్రాగా మారమని చెప్పి ఇప్పుడు మోసం చేసిందని, ఫిర్యాదులో పేర్కొంది. ఈ కేసును ఎలా పరిష్కరించాలని పోలీసులు తర్జనభర్జన పడుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

అమరావతిని ఇంచు కూడా కదిలించలేవు జగన్ | CBN Massive Speech | Asianet Telugu
YSRCP Mayor Candidate : నెల్లూరు మేయర్ అభ్యర్థిని ప్రకటించిన వైసిపి.. ఎవరీ విజయ్ కుమార్ రెడ్డి?