సోనూసూద్ ఫౌండేషన్ ఆక్సీజన్ ప్లాంట్ ఓపెన్ చేసిన అంధురాలు... చూపులేకపోయినా.. మనసుతో చూస్తుందంటూ కితాబు..

By AN TeluguFirst Published Jul 24, 2021, 10:45 AM IST
Highlights

బి. నాగలక్ష్మి అనే విజువల్లీ ఛాలెంజ్ డ్ మహిళ ఆక్సీజన్ ప్లాంట్ కోసం తనకు వస్తున్న పెన్షన్ లో నుంచి రూ. 15000వేలు సోనూసూద్ ఛారిటీ ఫౌండేషన్ కు సమర్పించింది. 

నెల్లూరు : నెల్లూరులో సోనూసూద్ డొనేట్ చేసిన ఆక్సీజన్ ప్లాంట్ ను ఓ అంధురాలు రిబ్బన్ కట్ చేసి ఓపెన్ చేసింది. నటుడు సోనూసూద్ ఫౌండేషన్ తరఫున నెల్లూరులోని ఆత్మకూరులో ఏర్పాటు చేసిన ఆక్సీజన్ ప్లాంట్ ఆదివారం ప్రారంభోత్సవం జరిగింది. 

బి. నాగలక్ష్మి అనే విజువల్లీ ఛాలెంజ్ డ్ మహిళ ఆక్సీజన్ ప్లాంట్ కోసం తనకు వస్తున్న పెన్షన్ లో నుంచి రూ. 15000వేలు సోనూసూద్ ఛారిటీ ఫౌండేషన్ కు సమర్పించింది. 

ఆ సమయంలో నాగలక్ష్మి దాతృత్వం మీద అనేక ప్రశంసలు కురిశాయి. నాగలక్ష్మి ప్రపంచంలోకెల్లా అత్యంత ధనవంతురాలు అని సోనూసూద్ ప్రశంసించారు. ఆమెకు చూపు లేకపోయినా.. ప్రజల పెయిన్ చూడగలుగుతుందని మెచ్చుకున్నారు. 

అంతేకాదు.. నాగలక్ష్మి తనకు వచ్చే రూ.3000పెన్షన్ నుంచి తన ఖర్చులు పోనూ దాచుకున్న వాటిలో నుంచి.. మరో పదివేలు ఫౌండేషన్ కు ఇవ్వాలని నిర్ణయించుకుంది. అంతేకాదు రూ.25 వేలు ముఖ్యమంత్రి సహాయనిధికి ఇవ్వాలని కూడా అనుకుంటోంది. 

సోనూసూద్ ఛారిటీ ఫౌండేషన్ దేశంలో ప్రారంభించిన మొదటి ఆక్సీజన్ ప్లాంట్ ఇది. రెండు నెలల క్రితం నెల్లూరు జిల్లా కలెక్టర్ కెవిఎన్ చక్రధర్ బాబు అభ్యర్థన మేరకు నెల్లూరులోని ఆత్మకూరు ప్రభుత్వాసుపత్రిలో ఆక్సీజన్ ప్లాంట్ పెట్టేందుకు సోనూసూద్ ముందుకు వచ్చారు. 

యుద్ధప్రాతిపదికన ప్లాంట్ నిర్మాణం, ఎక్వీప్ మెంట్ అమరిక జరిగింది. అత్యంత వేగంగా ఈ ప్లాంట్ రూపుదిద్దుకుంది. ఈ ప్రారంభోత్సవంలో పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, స్థానిక అధికారులు పాల్గొన్నారు. సోనూసూద్ దాతృత్వాన్ని గౌతమ్ రెడ్డి కొనియాడారు. ఈ ప్లాంటును 15 కోట్ల ఖర్చుతో నిర్మించారని తెలిపారు. 

సోనూసూద్ ను రమ్మని ఆహ్వానించామని వచ్చే రెండు నెలల్లో రావడానికి అంగీకరించారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఇంకా మాట్లాడుతూ నగరాలు, పట్టణాల్లో వైద్యసౌకర్యాలు బాగా ఉన్నచోట కాకుండా మారుమూల ప్రాంతమైన ఆత్మకూరులో ఆక్సీజన్ ప్లాంట్ పెట్టడానికి సోనూ సూద్ అంగీకరించడం చాలా మంచి విషయం అన్నారు. 

సోనూసూద్ కు అభ్యర్థన చేసిన కలెక్టర్ ను కూడా ఆయన ప్రశంసించారు. ఇక నాగలక్ష్మిని ఈ సందర్భంగా స్థానికుల ముందు సన్మానం చేశారు. ఆమె మనసు చాలా దయగలదని కొనియాడారు. 

click me!