ఎవరికో లోన్ ఇచ్చి.. కాంటాక్ట్ లిస్టులో ఉన్న మహిళకు కాల్ గర్ల్ గా ప్రచారం చేస్తామని బెదిరింపులు..

By SumaBala Bukka  |  First Published Sep 29, 2022, 1:31 PM IST

ఒకరికి అడగకుండానే అప్పు ఇచ్చి.. వారు కట్టకపోతే.. అతని కాంటాక్ట్ లిస్టులో ఉన్న మహిళను వేధింపులకు గురిచేసి.. ఆత్మహత్యయత్నం చేసేలా చేసిన ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. 


విశాఖపట్నం :  ఎవరికో అప్పు ఇచ్చి దాన్ని చెల్లించకుంటే కాల్ గర్ల్ అని ప్రచారం చేస్తామని సంబంధం లేని మహిళను బెదిరించిన వ్యక్తులను విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు బుధవారం నగర పోలీసులు వివరాలు వెల్లడించారు.. లోన్ యాప్ సంస్థ వారు విశాఖకు చెందిన ఓ వ్యక్తికి రూ. 4000, రూ.2500  చొప్పున మూడుసార్లు రుణాలు ఇచ్చారు. వాటిని అతను తిరిగి చెల్లించాడు.

అతను అడగక ముందే మరోసారి రూ.4వేలు అతని ఖాతాలో వేయగా వాటిని అతను కట్టలేదు. అతని కాంట్రాక్టు లిస్టులో పేరున్నందుకు.. తమ వద్ద తీసుకున్న అప్పును పూర్తిగా చెల్లించాలని లేదంటే, రుణాలను ఎగ్గొట్టే వ్యక్తిగా పేర్కొంటూ బంధువులతో పోస్టులు పంపుతామని విశాఖకు చెందిన ఓ మహిళకు బెదిరింపు సందేశాలు పంపించారు. ఆమె ఫోటో కింద కాల్ గర్ల్ అని రాసి, ఫోన్ నెంబర్ కూడా పెట్టి  వాట్సాప్ మెసేజ్ చేశారు. భయపడిన బాధితురాలు ఆందోళనతో ఆత్మహత్యాయత్నం చేసింది.  

Latest Videos

undefined

చెల్లివరసయ్యే వివాహితతో అక్రమసంబంధం.. నిలదీసిన భర్తను కిడ్నాప్ చేసిన టీఆర్ఎస్ నేత..

ఆ తర్వాత సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించగా సిఐ భవానీప్రసాద్ కేసు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల వాట్సాప్ లొకేషన్ అస్సాంలో, బ్యాంకు ఖాతా  నెంబర్ హర్యానాలో ఉన్నట్టు తెలుసుకున్నారు. ఇతర మొబైల్ నెంబర్లను పరిశీలించగా  నిందితులది ఢిల్లీగా గుర్తించారు. ఇలా చేస్తున్నది నేహా కుమారిగా తేల్చేశారు. నేహా కుమారి, ఆమె సోదరి పూజ ఇద్దరు టెలి ఫర్ఫార్మెన్స్ లో శిక్షకులుగా పని చేస్తున్నారు. ఆమె తమ్ముడైన  రాహుల్ మెహతా..  నేహా కుమారి హెచ్డిఎఫ్సి ఖాతాలను ఉపయోగిస్తున్నాడు.

ఈ కేసులో మొత్తం ఐదుగురు నిందితులను గుర్తించారు.  రాహుల్ మెహతా అతనికి సహకరిస్తున్న అభిషేక్ లను అరెస్టు చేశారు. నేహా కుమారికి 41ఏ  సీఆర్ పీసీ కింద నోటీసులు జారీ చేశారు. అరెస్టు చేసిన ఇద్దరిని ఢిల్లీ ద్వారకా కోర్టులో హాజరు పరచి, విశాఖకు తీసుకొచ్చారు. కోర్టులో హాజరుపరచగా  న్యాయస్థానం వారికి 15 రోజుల రిమాండ్ విధించింది. మిగిలిన ఇద్దరి కోసం పోలీసులు వెతుకుతున్నారు. 

click me!