యువతిపై కత్తులతో దాడి... చనిపోయిందనుకొని అటవీ ప్రాంతంలో వదిలి...

Published : Oct 26, 2022, 12:48 PM IST
యువతిపై కత్తులతో దాడి... చనిపోయిందనుకొని అటవీ ప్రాంతంలో వదిలి...

సారాంశం

ఓ యువతిపై గుర్తు తెలియని దుండగులు కత్తితో దాడి చేశారు. ఆ తరువాత చనిపోయిందనుకుని అటవీ ప్రాంతంలో వదిలి వెళ్లారు. 

తిరుపతి : తిరుపతి జిల్లాలో దారుణం యువతిపై కత్తులతో దుండగులు దాడి చేశారు. యువతి తలచేతులపై తీవ్ర గాయాలు అయ్యాయి. పరిస్థితి విషమంగా ఉంది. దొరవారి సత్రం మండలం మినమలమూడి అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. దాడి జరిగిన తరువాత యువతి చనిపోయిందనుకొని దుండగులు అటవీ ప్రాంతంలో వదిలి వెళ్ళిపోయారు. ఇది చూసిన స్థానికులు  పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులుయువతిని చికిత్స నిమిత్తం తమిళనాడుకు తరలించారు. బాధితురాలు తమిళనాడు వాసిగా గుర్తించారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. దాడి ఎందుకు జరిగింది? దీని వెనుక కారణాలేంటి? అనే విషయాలు తెలియాల్సి ఉంది.  

ఇదిలా ఉండగా, ఈ నెల 8న కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలో జరిగిన కత్తులతో దాడి చేసి మహిళ హత్య చేసిన కేసును పోలీసులు చేధించారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆస్తి కోసమే సొంత కూతురు, అల్లుడు పథకం ప్రకారమే హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడయ్యింది. పండగ కోసం తల్లిగారి ఇంటికి వచ్చినట్టు నమ్మించి కూతురు, అల్లుడు, వియ్యంకుడు కలిసి కిరాయి గుండాలతో తల్లి సులోచనను హత్య చేయించారని తేలింది. మృతురాలు సులోచన భర్త 20 ఏళ్ల కిందట చనిపోవడంతో ఆమె ఒంటరిగా ఉంటోంది.

ఆ 18 అసెంబ్లీ స్థానాలే జగన్ టార్గెట్: నేడు టెక్కలి వైసీపీ నేతలతో రివ్యూ

తమ ఆస్తి పై కన్నేసిన కూతురు, అల్లుడు, వియ్యంకుడు ఈ దారుణానికి తెగబడ్డారు. మృతురాలి కూతురు అదే గ్రామానికి చెందిన యువకుడిని ప్రేమ వివాహం చేసుకుంది. అప్పటి నుండి కుటుంబంలో కలహాలు మొదలైన మొదలయ్యాయి. సులోచన హత్య సమయంలో..అడ్డొచ్చిన సులోచన తల్లి రాధవ్వకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఆమెకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. హత్య చేసేందుకు దుండగులు ఇంట్లోకి వచ్చే ముందు మృతురాలి కూతురే తలుపులు తీసినట్టు నిందితులు పోలీసులకు వెల్లడించారు. 

కాగా, మగదిక్కు లేకుండా జీవిస్తున్నతల్లీబిడ్డలపై ఇంట్లోకి చొరబడి మరీ హత్యాయత్నానికి పాల్పడ్డారు దుండగులు. కత్తులతో విచక్షణారహితంగా దాడికి తెగబడటంతో కూతురు అక్కడికక్కడే మృతిచెందగా తల్లి ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతోంది. ఈ దారుణం కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. తిమ్మాపూర్ కు చెందిన గుజ్జుల సులోచన(45) ఇరవయ్యేళ్ల క్రితమే భర్తను కోల్పోయి ఒంటరిగా మారింది. దీంతో తల్లి రాధవ్వ(75)తో కలిసి పుట్టింట్లోనే వుంటోంది. 

అయితే గత అర్థరాత్రి తల్లీబిడ్డలు ఇంట్లో గాఢనిద్రలో వుండగా కత్తులతో ప్రవేశించిన దుండగులు ఒక్కసారిగా దాడికి దిగారు. దీంతో తీవ్రంగా గాయపడ్డ సులోచన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా రాధవ్వ తీవ్ర గాయాలతో ప్రాణాపాయస్థితిలో వున్నారు. స్థానికుల ఫిర్యాదుతో సంఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి హత్యకు పాల్పడిన దుండగులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.  

PREV
click me!

Recommended Stories

మహిళా రిజర్వేషన్ బిల్లు పై Pamula Pushpa Srivani Reaction | Women Reservation | Asianet News Telugu
పవన్‌ కళ్యాణ్‌.. 30వేల మంది మహిళలు ఏమయ్యారు? Vidadala Rajini Comments| Asianet News Telugu