శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేతలతో ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ సమావేశం కానున్నారు. వచ్చే ఎన్నికల్లో టెక్కలి నుండి విజయం సాధించే ప్రణాళికలను సిద్దం చేయనున్నారు.
అమరావతి:టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన పార్టీ నేతలతో ఏపీ సీఎం వైఎస్ జగన్ బుధవారం నాడు సమీక్ష నిర్వహించనున్నారు.2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ 23 ఎమ్మెల్యే స్థానాలను కైవసం చేసుకుంది. అయితే ఐదుగు ఎమ్మెల్యేలు టీడీపీని వీడి ఐదుగురు వైసీపీకి మద్దతు ప్రకటించారు. అయితే మిగిలిన 18 అసెంబ్లీ స్థానాల్లో వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధులు విజయం సాధించాలని జగన్ ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు ఇప్పటి నుండే వ్యూహత్మకంగా ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే కుప్పం, అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గాల వైసీపీ కార్యకర్తలతో జగన్ సమీక్ష నిర్వహించారు. ఇవాళ టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గంపై సీఎం రివ్యూ చేస్తారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించాలని జగన్ లక్ష్యంగా పెట్టుకున్నారు.
టెక్కలి అసెంబ్లీ స్థానం నుండి టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అచ్చెన్నాయుడును గత ఎన్నికల్లోనే ఓడించాలని జగన్ చేసిన ప్లాన్లు ఫలించలేదు. దీంో వచ్చే ఎన్నికల్లో టెక్కలిలో అచ్చెన్నాయుడును ఓడించాలని జగన్ ఇప్పటి నుండే కార్యాచరణను సిద్దం చేస్తున్నారు.
undefined
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో మెజారిటీ స్థానాలను వైసీపీ గెలుపొందింది. దీంతో రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందడం సునాయాసమనే అభిప్రాయంలో వైసీపీ నాయకత్వం ఉంది. కుప్పంలో ఎమ్మెల్సీ భరత్ నాయకత్వంలో పార్టీని బలోపేతం చేసేందుకు వ్యూహ రచన చేశారు. చిత్తూరు జిల్లాకు చెందిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పంపై కేంద్రీకరించారు.ఎమ్మెల్సీ భరత్ కు అండగా ఉంటూ కుప్పంలో చంద్రబాబు కోటను బద్దలు కొట్టారు. అయితే వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించేందుకు వ్యూహత్మకంగా ముందుకు వెళ్తున్నారు. ఇటీవలనే కుప్పంలో జగన్ సభ నిర్వహించారు. కుప్పంలో భరత్ ను గెలిపిస్తే మంత్రిని చేస్తానని సీఎం జగన్ హామీ ఇచ్చారు.టెక్కలిలో వైసీపీ నాయకుల మధ్య ఉన్న అగాధం కూడ పరోక్షంగా అచ్చెన్నాయుడు గెలుపునకు దోహదం చేసిందని అభిప్రాయాలు కూడా లేకపోలేదు.
టెక్కలికి చెందిన వైసీపీ నేతలు దువ్వాడశ్రీనివాస్ ,పేరాడ తిలకర్ , మాజీ ఎంపీ కిల్లి కృపారాణి వంటి కీలక నేతలు ఉన్నప్పటికి టెక్కలిలో వైసీపీ విజయం సాధించకపోవడంపై ఆ పార్టీ నాయకత్వం అసంతృప్తితో ఉంది. సీఎం జగన్ తో జరిగే సమావేశానికి గత ఎన్నికల్లో టికెట్ నిరాకరించిన బి.ప్రకాష్ కు కూడ పార్టీ నాయకత్వం ఆహ్వానం పంపింది.టెక్కలిలో కళింగ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువగా ఉంటారు.అయితే 2009లో మినహా ఎప్పుడూ ఆ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్ధులు విజయం సాధించలేదు. దీంతో కొత్త వ్యూహంతో ముందుకు వెళ్లాలని జగన్ సర్కార్ భావిస్తుంది. ఈ వ్యూహంపై పార్టీ నేతలతో సీఎం చర్చించనున్నారు.టెక్కలికి చెందిన కిల్లి కృపారాణి 2009లో కాంగ్రెస్ అభ్యర్ధిగా శ్రీకాకుళం ఎంపీగా విజయం సాధించారు.2019లో ఆమె ఓటమి పాలయ్యారు. తర్వాత వైసీపీలో చేరారు.