సీఎం క్యాంప్ కార్యాలయంలో కోడికత్తి శ్రీను కుటుంబసభ్యులు.. ఎందుకంటే..

By SumaBala BukkaFirst Published Oct 26, 2022, 12:10 PM IST
Highlights

కోడికత్తి కేసులో జైలులో ఉన్న తన కొడుకుకు గ్రీవెన్స్ లో బెయిల్ కోసం ఎన్వోసీ కావాలంటూ అతని తల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చింది. 2018లో విశాఖ ఎయిర్ పోర్టులో జగన్ మీద దాడి జరిగింది.

అమరావతి :  కోడికత్తి కేసులో నిందితుడైన శ్రీనివాస్ తల్లి సీఎం వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయానికి వచ్చారు. ఆమెతో పాటు శ్రీనివాస్ తమ్ముడు, లాయర్ కూడా ఉన్నారు. గ్రీవెన్స్ లో తన కుమారుడు బెయిల్ కోసం సీఎం వైఎస్ జగన్ ను ఎన్వోసీ కోరేందుకు కోడికత్తి శ్రీను కుటుంబ సభ్యులు వచ్చారు. ప్రతిపక్ష నేత జగన్ ఉన్న సమయం లో వైఎస్ జగన్ పై కోడి కత్తితో  శ్రీను దాడి చేసిన విషయం తెలిసిందే. కాగా గత నాలుగేళ్లుగా  శ్రీను జైలులోనే ఉన్నాడు. 

ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన కోడికత్తి కేసులో నిందితుడిగా ఉన్న శ్రీనివాస్ తల్లి సావిత్రి జూలై 9న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కు లేఖ రాశారు. తన కుమారుడు శ్రీనివాస్ ను తక్షణమే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. సుమారు నాలుగేళ్లుగా తన కుమారుడిని రిమాండ్ ఖైదీగానే కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసుకు సంబంధించి న్యాయస్థానం ఎలాంటి విచారణ జరపడం లేదని  సావిత్రి పేర్కొన్నారు. 

2018లో విజయనగరం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న జగన్ అక్టోబర్ 25న హైదరాబాద్ వెళ్లేందుకు విశాఖ విమానాశ్రయానికి వెళ్లగా.. అక్కడ ఓ యువకుడు ఒక్కసారిగా కోడిపందాలు కత్తితో జగన్ పై దాడి చేసి గాయపరిచాడు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది.  2018 అక్టోబర్ లో  అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ఇప్పటి ముఖ్యమంత్రి వైసిపి అధినేత జగన్ పై విశాఖ ఎయిర్పోర్టులో దాడి జరిగింది.  శ్రీనివాస రావు అనే వెయిటర్ కోడి కత్తితో జగన్ పై దాడి చేశాడు. ఈ దాడిలో జగన్ ఎడమ చేతికి గాయం అయింది. 

హమాలీ కుమారుడికి ఐఐటీలో సీటు.. అనంతపురం కలెక్టర్ చొరవతో పేద విద్యార్థికి అందిన ఆర్థిక సాయం..

అయితే, ఆ దాడిలో జగన్ చేతికి ఎంత లోతు గాయం అయింది. అనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మొదట్లో సెంటీమీటర్ అని చెప్పి ఆ తరువాత నాలుగు సెంటీమీటర్లు అని చెప్పడంతో  చర్చనీయాంశంగా మారింది. మొదట విశాఖలో వైద్యం అందించిన డాక్టర్లు ఆ తర్వాత హైదరాబాద్కు జగన్ ను మార్చారు.  గాయం తగ్గడానికి చాలా సమయం పడుతుందని చెప్పారు. జగన్ కు గాయమైన సమయంలో తీసిన బ్లడ్ శాంపిల్ లను పరీక్షల నిమిత్తం పంపించారు. అయితే ఆ రక్తపరీక్షకు సంబంధించిన రిపోర్టుల్లో  ఎలాంటి విషం నమూనాలు లేవని తేలిందన్నారు. 

ఇక ఈ దాడి విషయంలో అనేక మందిపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. సొంత పార్టీకి చెందిన బొత్స సత్యనారాయణ మేనల్లుడు హస్తం ఉందని నక్క ఆనంద్ బాబు ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ కోడికత్తిని బొత్స మేనల్లుడు చిన్న శ్రీను విమానాశ్రయానికి తీసుకెళ్లారని,  ఆ ఆధారాలు దొరక్కుండా చేశారని మంత్రి ఆరోపించారు. దాడి జరిగిన తర్వాత జగన్ స్పందించకపోవడం అనుమానం కలిగిస్తోందని, నోరువిప్పి జరిగిందేమిటో చెప్పి పోలీసులకు సహకరించాలని ఆనందబాబు సూచించారు. ఈ దాడి విషయంలో బీజేపీ చేస్తున్న బెదిరింపులకు భయపడేది లేదని జగన్ విచారణకు సహకరించకుంటే అరెస్టు చేసి విచారణ జరపాలని ఆనంద్ బాబు డిమాండ్ చేశారు. 

కాగా,  జగన్ పై దాడి జరిగితే చంద్రబాబు సరిగా స్పందించలేదని వైసీపీ నేతలు మండిపడ్డారు. కోడి కత్తి డ్రామా స్క్రిప్ట్ ఢిల్లీలో రెడీ అయ్యిందని.. విశాఖలో యాక్షన్ స్టార్ట్ అయ్యిందని.. కత్తిని వచ్చింది వైసీపీ కార్యకర్త అంటూ నారా లోకేష్ మండిపడ్డారు. జగన్ పై దాడి జరిగిన తర్వాత విశాఖపట్నం హైదరాబాద్ విమానాశ్రయాలలో మూడు గంటలపాటు చేతులు ఊపిన తరువాత ఆస్పత్రిలో పడిపోయారని చికిత్స చేయించుకున్న ఫోటోలను విడుదల చేసి అల్లర్లకు ప్రయత్నించారని ధ్వజమెత్తారు. 

click me!