వివాహేతర సంబంధం.. ప్రియుడి సాయంతో భర్తను చంపి.. గోతాంలో కుక్కి, నక్కల కాలువలో పడేసిన భార్య..

Published : Nov 21, 2022, 11:42 AM ISTUpdated : Dec 03, 2022, 03:15 PM IST
వివాహేతర సంబంధం.. ప్రియుడి సాయంతో  భర్తను చంపి.. గోతాంలో కుక్కి, నక్కల కాలువలో పడేసిన భార్య..

సారాంశం

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ భార్య దారుణానికి ఒడిగట్టింది. కులాంతర వివాహం చేసుకుని, నలుగురు పిల్లలకు తల్లినని మరిచిపోయి అతి క్రూరంగా హతమార్చింది.

నెల్లూరు జిల్లా :  తన వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భార్య దారుణానికి తెగించింది. ప్రియుడితో కలిసి భర్తను హతమార్చి గోతంలో కుక్కి, కాలువలో పడేసింది. ఆ చంపేసిన భర్తను ఆమె ప్రేమించి కులాంతర వివాహం చేసుకుంది. నలుగురు బిడ్డలు కూడా పుట్టారు. ఆ తరువాత మరో వ్యక్తి మోజులో భర్తనే కడతేర్చింది. ఈ ఘటన నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలో వెలుగు చూసింది. భర్త తన వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించాడని.. ఇంత దారుణానికి తెగించింది. ప్రియుడితో కలిసి హతమార్చింది. 

పోలీసులు తెలిపిన వివరాల ఇలా ఉన్నాయి.. ఇందుకూరుపేట మండలం డేవిస్ పేటకు చెందిన గందల్ల చిన్నమణి (42), శోభ అనే మహిళను ప్రేమించి, కులాంతర వివాహం చేసుకున్నారు. చిన్నమణి, శోభ ఇద్దరూ నెల్లూరు గ్రామీణ మండలం నారాయణ రెడ్డి పేటకు చెందిన భరత్ కుమార్ రెడ్డి దగ్గర పనిచేసేవారు. ఈ క్రమంలో శోభ కు భరత్ తో పరిచయం పెరిగింది. అది వారిద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇది చివరికి చిన్నమణికి తెలిసింది. దీతో శోభతో, భరత్ తో చిన్నమణి ఘర్షణ పడ్డాడు. ఆ తరువాత భరత్ దగ్గర పని మానేసి.. అక్కడి నుంచి మకాం కూడా మార్చేశారు. 

ఆ తరువాత భార్యభర్తలిద్దరూ రెండు నెలల క్రితం ముత్తుకూరు మండలం పంటపాళెం సమీపంలోని రొయ్యల చెరువుల దగ్గర కాపలా పనులకు కుదిరారు. అయితే, అక్కడ చేరినా శోభ తరచూ భరత్ తో ఫోన్ లో కాంటాక్ట్ లో ఉండేది. ఇది చినమణి గమనించాడు. అలా చేయద్దంటూ ఆమెతో గొడవపడేవాడు. అదే క్రమంలో ఈ  నెల 15న రాత్రి అలాగే శోభతో చినమణి గొడవపడ్డాడు. దీంతో శోభ.. భరత్ కు ఫోన్ చేసి భర్తను ఎలాగైనా చంపేయాలని కోరింది. భరత్ కుమార్ రెడ్డి మరో ముగ్గురితో కలిసి  హత్యకు ప్లాన్ వేశాడు. అందులో భాగంగా అదే రోజు అర్థరాత్రి 12 గంటలకు వారున్న ప్రదేశానికి చేరుకున్నాడు.

విషాదం.. ఇంట్లో కమ్ముకున్న పొగలో ఊపిరాడక.. తండ్రీకొడుకు మృతి..

అప్పటికే మద్యం మత్తులో నిద్రపోతున్న చినమణిని.. శోభ, భరత్ కుమార్ రెడ్డి.. భరత్ తోపాటు వచ్చిన మస్తాన్, సమీవుల్లా, నవీన్ లు కలిసి గొంతు పిసికి చంపేశారు. ఆ తరువాత చినమణి మృతదేహాన్ని గోనె సంచిలో కుక్కారు. తీసుకువెళ్లి పక్కనున్న నక్కల కాలువలో పడేశారు. ఆ తరువాత శోభ మంగళవారం ఉదయం.. బంధువులకు ఫోన్ చేసి భర్త కనిపించడం లేదని చెప్పింది. విషయం తెలిసిన శోభ, చినమణి కొడుకు వెంకటేష్ అక్కడికి చేరుకున్నాడు. తండ్రి కనిపించడం లేదని ముత్తుకూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది. ఆదివారం పోలీసులు మణి మృతదేహాన్ని నక్కల కాలువలో గాలించి వెలికి తీశారు. నిందితులమీద హత్య, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారు. వీటితో పాటు రౌడీషీటు నమోదు చేయనున్నట్లు నెల్లూరు డీఎస్పీ హరనాథ్ రెడ్డి తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

మహిళా రిజర్వేషన్ బిల్లు పై Pamula Pushpa Srivani Reaction | Women Reservation | Asianet News Telugu
పవన్‌ కళ్యాణ్‌.. 30వేల మంది మహిళలు ఏమయ్యారు? Vidadala Rajini Comments| Asianet News Telugu