పవిత్ర కృష్ణా నదిలో కృష్ణ అస్థికలను కలిపేందుకు విజయవాడకు చేరుకున్న మహేష్ బాబు..

Published : Nov 21, 2022, 11:21 AM IST
 పవిత్ర కృష్ణా నదిలో కృష్ణ అస్థికలను కలిపేందుకు విజయవాడకు చేరుకున్న మహేష్ బాబు..

సారాంశం

ప్రముఖ సినీనటుడు మహేష్ బాబు తన కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిసి విజయవాడకు వచ్చారు. ఇటీవల కన్నుమూసిన తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ అస్థికలను పవిత్ర కృష్ణా నదిలో కలిపేందుకు మహేష్ బాబు విజయవాడకు చేరుకన్నారు. 

ప్రముఖ సినీనటుడు మహేష్ బాబు తన కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిసి విజయవాడకు వచ్చారు. ఇటీవల కన్నుమూసిన తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ అస్థికలను పవిత్ర కృష్ణా నదిలో కలిపేందుకు మహేష్ బాబు విజయవాడకు చేరుకన్నారు.  మహేష్ బాబు వెంట ఆదిశేషగిరి రావు, గల్లా  జయదేవ్, త్రివిక్రమ్ శ్రీనివాస్, నాగ వంశీ.. తదితరులు ఉన్నారు. పాతూరి నాగభూషణం గెస్ట్ హౌస్ దగ్గర కృష్ణా నదిలో కృష్ణ అస్థికలను మహేష్ బాబు నిమజ్జనం చేయనున్నారు. శాస్త్రోత్తకంగా పూజా కార్యక్రమాలు పూర్తి చేసిన తర్వాత అస్థికలను మహేష్ బాబు ఇక్కడికి వచ్చినట్టుగా తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున చేరుకన్నారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా లోనికి కొందరిని మాత్రమే అధికారులు లోనికి అనుమతించారు. 

ఇక, సూపర్ స్టార్ కృష్ణ నవంబర్ 15న కన్నుమూసిన సంగతి తెలిసిందే. గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన కృష్ణా.. ఆస్పత్రిలో చికిత్స పొందతూ 15వ తేదీ తెల్లవారుజామున 4.09 గంటలకు తుదిశ్వాస విడిచారు. అయితే కృష్ణ మృతిపట్ల దేశ ప్రధాని మోదీతో సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల సీఎంలతో సహా పలువురు రాజకీయ ప్రముఖులు, పెద్ద ఎత్తున సినీ ప్రముఖులు కృష్ణ భౌతికకాయానికి నివాళులర్పించారు.

 

ఆ మరుసటి రోజు కృష్ణ అంత్యక్రియలు నిర్వహించారు.అయితే ఏడాది కాలంలోనే సోదరుడు, తల్లి, తండ్రి‌లను కోల్పోవడం మహేష్ బాబు కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?