
కడప : kadapa district పోరుమామిళ్లలో దారుణం చోటుచేసుకుంది. Extramarital affair నెపంతో షేక్ మున్నీ (30) అనే మహిళను నిర్బంధించి, హింసించి murder చేశారు. సోమవారం రాత్రి జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమెను మంగళవారం ఆసుపత్రికి తీసుకువెళ్లగా.. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మరణించినట్లు ధ్రువీకరించారు. ఈ ఉదంతం స్థానికంగా సంచలనం అయింది. ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన Sheikh Munniకి కలసపాడు మండలం రామాపురం గ్రామంలో ఓ వ్యక్తితో marriage అయ్యింది. కొంతకాలం సజావుగా సాగిన వీరి సంసారం.. ఆ తరువాత గొడవలు మొదలయ్యాయి. దీంతో కొంతకాలానికి ఇద్దరూ విడిపోయారు.
దీంతో, ఆమె ఏడాదిగా కడప జిల్లా పోరుమామిళ్లలోని సూపర్ మార్కెట్ లో పనిచేస్తూ జీవిస్తోంది. అక్కడే గది అద్దెకి తీసుకుని తల్లి షకీలతో కలిసి ఉంటుంది. అయితే, సూపర్ మార్కెట్ యజమాని మాబు హుస్సేన్ తో మున్నీ సన్నిహితంగా మెలిగినట్లు ప్రచారం సాగుతోంది. ఈ విషయంపై రెండు కుటుంబాల మధ్య వివాదం నెలకొంది. ఈ కారణంగా ఐదు నెలల క్రితం సూపర్ మార్కెట్ లో పని మానేసి గిద్దలూరుకు వచ్చి ఉంటుంది. అయినప్పటికీ మాబు కుటుంబంలో గొడవలు ఎక్కువ అయ్యాయి. దీనంతటికీ కారణం మున్నీనే అని భావించిన మాబు హుస్సేన్ కుటుంబసభ్యులు కానిస్టేబుళ్లు సయ్యద్, జిలానిలను వెంటబెట్టుకుని సోమవారం సాయంత్రం గిద్దలూరు వెళ్లారు.
మున్నీ ఇంటికి వెళ్లి ఆమెను బలవంతంగా కారులో ఎక్కించుకుని పోరుమామిళ్ల తీసుకువెళ్లారు. ఆమెను వాహనంలో ఎక్కించే సమయంలో కానిస్టేబుళ్లు కాళ్లతో తన్నారు అని స్థానికులు చెబుతున్నారు. ఈ మేరకు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో మృతురాలి తల్లి షకీలా పేర్కొంది. వాహనంలో మున్నీని కొట్టుకుంటూ తీసుకువెళ్లిన కానిస్టేబుళ్లు ఆమెను మాబు హుస్సేన్ నివసించే వీధిలో పడేశారు. తర్వాత మరికొందరితో కలిసి ఆమెను చిత్రహింసలు పెట్టి గాయపరిచారు.
ఆ గాయాలతో ఆమె మరణించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఆ తర్వాత నిందితులు.. మున్నీని కడప రిమ్స్ కు తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు మృతదేహానికి శవపరీక్ష నిర్వహించారు. హత్యోదంతంలో 11 మందిపై కేసులు నమోదు చేసినట్లు పోరుమామిళ్ల సిఐ రమేష్ బాబు తెలిపారు.ఈ జాబితాలో ఇద్దరు కానిస్టేబుళ్ల పేర్లూ ఉన్నట్లు... అందరినీ అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. కానిస్టేబుళ్లు సయ్యద్, జిలానీలను అరెస్టు చేస్తామని కడప ఎస్పీ అన్బురాజన్ తెలిపారు.
ఇదిలా ఉండగా, మార్చి 27న కడపజిల్లాలోనే ఇలాంటి మరో దారుణ ఘటన జరిగింది. ఈ నెల 11వ తేదీన కడప జిల్లా అనుంపల్లి అడవుల్లో చోటుచేసుకున్న మహిళ హత్యకు వివాహేతర సంబంధమే కారణంమని పోలీసులు తేల్చారు. మృతురాలి ప్రియుడే అతికిరాతకంగా హతమార్చి ఒంటిపై వున్న బంగారాన్ని దోచుకున్నట్లు పోలీసులు నిర్దారించారు. రాయచోటి పట్టణానికి చెందిన కళావతి(50) రామాపురం మండలం కొండవాండ్లపల్లె గ్రామానికి చెందిన పూదోట గురవయ్య(40)తో వివాహేతర సంబంధం ఉంది. గురవయ్య అవసరాల కోసం బాగా అప్పులు చేసాడు. కళావతి దగ్గరున్న బంగారాన్ని అమ్మేసి ఆ డబ్బులు అప్పులు తీర్చాలని గురవయ్య భావించాడు. అడిగితే ఇవ్వదు కాబట్టి హత్యకు కుట్ర పన్నాడు. అలా మార్చి 11వ తేదీన కళావతిని శిబ్యాల సమీపంలోని అనుంపల్లి అడవుల్లోకి తీసుకెళ్లి కత్తితో గొంతు కోసాడు. తీవ్ర రక్తస్రావమై కళావతి మరణించింది. ఆ తరువాత ఆమె ఒంటిపై వున్న బంగారు ఆభరణాలను తీసుకుని, మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పంటించి అక్కడినుండి వెళ్లిపోయాడు.