Nara Lokesh: టీడీపీ అన్ స్టాపబుల్.. పార్టీ రిక్డారులు బద్దలు కొట్టడం ఎవరి వల్ల కాదు: నారా లోకేశ్

Published : Mar 29, 2022, 11:23 PM IST
Nara Lokesh: టీడీపీ అన్ స్టాపబుల్.. పార్టీ రిక్డారులు బద్దలు కొట్టడం ఎవరి వల్ల కాదు: నారా లోకేశ్

సారాంశం

Nara Lokesh:  టీడీపీ 40 వ‌సంతాల వేడుక‌ల సంద‌ర్భంగా ఆ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ అధికార వైసీపీపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తెలుగుదేశం పార్టీ రికార్డులు బద్దలు కొట్టడం ఎవరి వల్లా కాదనీ, రికార్డులు సృష్టించాలన్నా...వాటిని తిరగరాయాలన్నా అది ఒక్క టిడిపి కే సాధ్యమ‌నీ.. టిడిపి అన్ స్టాపబుల్ అని అన్నారు. టీడీపీ ప్రజల పార్టీ...జగన్ రెడ్డి ది గాలి పార్టీ అని విమ‌ర్శించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర‌ విభ‌జ‌న‌ త‌ర్వాత బంగారు బాతు హైద‌రాబాద్‌ను కోల్పోయామ‌న్న లోకేశ్..హైద‌రాబాద్‌కు దీటుగా అమ‌రావ‌తి నిర్మాణాన్ని ప్రారంభించామ‌ని చెప్పారు.    

Nara Lokesh: టీడీపీ 40 వ‌సంతాల వేడుక‌ల సంద‌ర్భంగా ఆ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ అధికార వైసీపీపై విరుచుకుప‌డ్డారు. మంగ‌ళ‌గిరిలోజ‌రిగిన వేడుక‌ల్లో ప్ర‌తి ప‌క్షాల‌పై త‌న‌దైన శైలిలో విరుచ‌క‌ప‌డ్డారు. ప్ర‌ధానంగా ఆయ‌న ప్ర‌సంగంలో అధికార పార్టీ వైసీపీ, ఆ పార్టీ అధినేత సీఎం జ‌గ‌న్ పై ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. టీడీపీ శ్రేణుల‌ను వేధింపుల‌కు గురి చేస్తున్న వైసీపీ నేత‌ల‌ను వ‌దిలిపెట్టే ప్ర‌స‌క్తే లేద‌ని హెచ్చ‌రించిన లోకేశ్.. వైసీపీ నేతలు అమెరికా వెళ్లినా, ఐవ‌రీకోస్ట్ వెళ్లినా వ‌దిలిపెట్ట‌న‌ని వార్నింగ్ ఇచ్చారు.  

దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసింది ఎన్టీఆర్ అనీ, దేశానికి అభివృద్ధిని పరిచయం చంద్ర‌బాబు నాయుడ‌ని అన్నారు. ఎన్టీఆర్ గారు.. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళుగా భావించార‌ని, పేదరికం లేని సమాజం నిర్మించడమే, టీడీపీ ఆశయం అన్నారు. తెలుగు వారి ఆత్మగౌరవం తెలుగుదేశం పార్టీన‌నీ, సామాన్యులను నాయకుల్ని చేసింది ఘ‌త‌న‌ తెలుగుదేశం పార్టీకే ద‌క్కుతోంద‌నీ, టీడీపీ పోటీ చేసిన తొలి ఎన్నికల్లో 20 మంది డాక్టర్లను, 8 మంది ఇంజనీర్లు, 47 మంది లాయర్లు, 125 మంది గ్రాడ్యుయేట్లు, 28 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లకు టిక్కెట్లు ఇచ్చార‌నీ, ఇలా టికెట్ల పంపిణీలో స‌మానత్వం చూపిన పార్టీ టీడీపీనేన‌ని నారా లోకేష్ అన్నారు.  

టీపీడీ త‌న 40 ఏళ్ల ప్రయాణంలో 21 సంవత్సరాలు అధికారంలో..19 ఏళ్లు ప్రతిపక్షంలో ఉంద‌నీ, అధికారం ఉన్నా లేకపోయినా.. ప్రతి క్షణం ప్రజల కోసం ఆలోచించే పార్టీ టీడీపీనేని అన్నారు. రెండు రూపాయిలకే కిలో బియ్యం, రైతులకు 50 రూపాయలకే హార్స్ పవర్ విద్యుత్, 65 ఏళ్లు దాటిన వారికి 30 రూపాయల పెన్షన్, జనతా వస్త్రాల పేరుతో తక్కువ ధరకే బట్టలు అందించడం, పక్కా ఇళ్ళ నిర్మాణం ఇలా చెప్పుకుంటూ పోతే దేశంలో అమలవుతున్న అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించింది ఎన్టీఆర్ గారేన‌నీ అన్నారు.  

పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు, మండల వ్యవస్థ ఏర్పాటు, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించింది ఎన్టీఆర్ అని అన్నారు.  బడుగు,బలహీన వర్గాల వారికి అసలైన స్వాతంత్య్రం తెచ్చింది తెలుగు దేశం పార్టీనేన‌ని గుర్తు చేశారు. సమాజంలో సగం ఉన్న బిసిలకు అధికారం అందించిందినా ఘ‌త‌న టీడీపీకే ద‌క్కుతుంద‌నీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిలకు రిజర్వేషన్లు ఇచ్చింది టీడీపేన‌నీ, చట్ట సభల్లో బిసిలను గర్వంగా కూర్చోబెట్టింది టిడిపిన‌నీ అన్నారు.  అలా.. లోక్ సభ తోలి దళిత స్పీకర్ గా బాలయోగి, ఏపీ అసెంబ్లీ తొలి దళిత మహిళా స్పీకర్ ప్రతిభా భారతి. బడుగు, బలహీన వర్గాల వారికి ఉన్నత పదవులు ఇచ్చిన ఘ‌త‌న టీడీపీకే ద‌క్కుతోంద‌ని వివ‌రించారు. 

ఇరిగేషన్ రంగం గురించి రాష్ట్రంలో తొలిసారి ఆలోచనలు చేసింది ఎన్టీఆరేన‌నీ, తెలుగు గంగ, హంద్రీనీవా ప్రాజెక్టులు రూపకల్పన చేసింది ఎన్టిఆరే న‌నీ వివరించారు. కృష్ణా, గోదావరి నదులను చంద్రబాబు అనుసంధానం చేశార‌నీ,  ఆయ‌న విజన్ ఉన్న నాయకుడని అన్నారు. చంద్రబాబు గొప్ప‌నాయకుడనీ, తెలుగురాష్ట్రాల‌కు ఐటీని ప‌రిచ‌యం చేసింది ఆయ‌నేన‌ని, తొలుత‌  హైటెక్ సిటీ కడితే ప్రజా ధనం వృధా చేస్తున్నారని ఆరోపణలు చేసారని, కానీ నేడు   తెలంగాణ రాష్ట్రానికి ఎక్కువ శాతం ఆదాయం ఐటీ నుండే వస్తుందని అన్నారు.  రాష్ట్ర విభజనలో  బంగారు బాతు లాంటి హైదరాబాద్ ని కోల్పోయ‌మ‌నీ, హైదరాబాద్ కి ధీటైన నగరం ఉండాలనే  అమరావతి నిర్మించార‌ని అన్నారు.  

ఒకే రాష్ట్రం...ఒకే రాజధాని మన నినాదం

చంద్రబాబు అభివృద్ధి వికేంద్రీకరణ చేశార‌నీ, ఈ క్ర‌మంలో చిత్తూరు కి సెల్ ఫోన్లు, ఎలెక్ట్రానిక్స్ కంపెనీలు, అనంతపురం కి కియా కంపెనీ, కర్నూలు కి సోలార్, మెగా సీడ్ పార్క్ అలాగే.. విశాఖకి ఐటీ కంపెనీలు ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కో జిల్లాని బంగారు బాతు చెయ్యాలనే ప్రణాళిక అమలు చేసారని వివ‌రించారు. రాష్ట్రంలో చంద్రబాబు హయాంలోనే సంక్షేమం, అభివృద్ధి జోడెద్దుల బండి లా సాగింద‌నీ, పేద వాళ్ళ ఆకలి తీర్చడానికి అన్న క్యాంటిన్, మహిళలకు పసుపు -కుంకుమ, రైతులకు అన్నదాత సుఖీభవ వంటి ప‌థ‌కాల‌ను అందించార‌ని గుర్తు చేశారు. 

టీడీపీ.. జాతీయ స్థాయిలో కూడా అనేక సార్లు మన సత్తా ఏంటో చూపించింద‌నీ, 1984లో లోక్ సభలో ప్రధాన ప్రతిపక్షంగా ప్రాంతీయ పార్టీ అయిన టిడిపి నిలిచింద‌నీ, అప్పటికి ఇప్పటికీ ఆ రికార్డు టిడిపి పేరు మీద‌నే ఉంద‌ని అన్నారు.  26 సందర్భాల్లో ఆర్టికల్ 356 ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోశారనీ,. అయితే టిడిపి దీన్ని 1984లో అడ్డుకుందనీ వివ‌రించారు. నాటి ఆ పోరాటం రాజకీయ చరిత్రలోనే పెను సంచలనం. ప్రజల భాగస్వామ్యంలో జరిగిన ఆ ప్రజాస్వామ్య ఉద్యమం భావితరాలకు ఒక స్పూర్తిని ఇచ్చింద‌నీ గుర్తు చేశారు. 

నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ ల ఏర్పాటుతో కేంద్రంలో ప్రభుత్వాల ఏర్పాటులో ఎంతో కీలకంగా వ్యవహరించామ‌నీ, ఎన్ని అవకాశాలు వచ్చినా పదవుల కోసం కాకుండా...రాష్ట్ర భవిష్యత్ కోసం దాన్ని ఉపయోగించిన పార్టీ కూడా తెలుగు దేశమేన‌ని అన్నారు. అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతిని చెయ్యడంలో కీలక పాత్ర పోషించామ‌ని తెలిపారు.  టీడీపీరికార్డులు బద్దలు కొట్టడం ఎవరి వల్లా కాదనీ, రికార్డులు సృష్టించాలన్నా...వాటిని తిరగరాయాలన్నా అది ఒక్క టిడిపి కే సాధ్యమ‌నీ.. టిడిపి అన్ స్టాపబుల్ అని అన్నారు. టీడీపీ ప్రజల పార్టీ...జగన్ రెడ్డి ది గాలి పార్టీ అని విమ‌ర్శించారు.  

ఎన్టీఆర్ గారు, చంద్రబాబు గారు కలిసి ఇచ్చిన పెన్షన్ రూ.1875 ఇచ్చార‌నీ, వైఎస్సార్ గారు, జగన్ రెడ్డి ఇచ్చిన పెన్షన్ రూ.625 అని విమ‌ర్శించారు. మ‌హిళలకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చింది టీడీపీనేన‌ని, ఆస్తిలో వాటా లేదని సొంత చెల్లి, తల్లిని పక్క రాష్ట్రానికి గెంటేసింది జగన్ రెడ్డి అని విమ‌ర్శించారు. 
  
 మనది కియా... వాళ్ళది కోడి కత్తి.

టీడీపీ అధినేత చంద్ర‌బాబు విజ‌న‌రీ ఉన్న నేత అని.. వైసీపీ అధినేత జ‌గ‌న్ ప్రిజ‌న‌రీ నేత అని విమ‌ర్శించారు. టీడీపీని కార్య‌క‌ర్త‌ల పార్టీగా, వైసీపీని దొంగ‌లు, డెకాయిట్ల పార్టీగా  లోకేష్ అభివ‌ర్ణించారు. టీడీపీ ప్ర‌జ‌ల పార్టీ అయితే.. జ‌గ‌న్ రెడ్డిది గాలి పార్టీ అని వ్యాఖ్యానించారు. మ‌హిళ‌ల‌కు టీడీపీ ప‌సుపు కుంకుమ అమ‌లు చేస్తే.. నాన్న బుడ్డితో మ‌హిళ‌ల ప‌సుపు కుంకుమ‌ను వైసీపీ తుడిచేస్తోంద‌ని లోకేశ్ ఆరోపించారు.  

చెత్త ప‌న్ను, ఇంటి ప‌న్ను పేరిట ఆస్తులు జ‌ప్తుచేస్తున్నారని ఆయ‌న వైసీపీ ప్ర‌భుత్వంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాష్ట్రంలో ఎవ‌రూ సంతోషంగా బ‌త‌క‌కూడ‌ద‌నేది జ‌గ‌న్ విధానంగా చెప్పిన లోకేశ్.. జ‌గ‌న్ పాల‌న‌లో ఎవ‌రూ సంతోషంగా లేరని, అంద‌రినీ వేధిస్తున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. టీడీపీ కుటుంబ స‌భ్యులను ఇబ్బందుల‌కు గురి చేస్తున్నార‌న్న లోకేశ్.. ఇబ్బంది పెట్టిన వైసీపీ నేత‌ల‌కు సినిమా మొద‌లవుతోందని హెచ్చ‌రించారు. వైసీపీ నేత‌లు అమెరికా వెళ్లినా..ఐవ‌రీ కోస్ట్ వెళ్లినా వ‌దిలేది లేదని అన్నారు. త‌న‌ త‌ల్లిని అవ‌మానించిన వారిని ఎవ‌రినీ వ‌దిలిపెట్ట‌న‌ని శ‌ప‌థం చేసిన లోకేశ్.. త‌న‌పై హ‌త్యాయ‌త్నంతో పాటు 11 అక్ర‌మ కేసులు పెట్టారని ధ్వ‌జ‌మెత్తారు. పోరాటం చేసి ముల్లును ముల్లుతోనే తీద్దామంటూ ఆయ‌న పార్టీ శ్రేణుల‌కు పిలుపునిచ్చారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?