
వచ్చే నెల 8న ఏపీ గవర్నర్ (ap governor) బిశ్వభూషణ్ హరిచందన్‌ను (Biswabhusan Harichandan) కలవనున్నారు సీఎం జగన్ (ys jagan) . కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై గవర్నర్‌కు వివరించనున్నారు సీఎం. 11వ తేదీ నాడు ఆయన అపాయింట్మెంట్ తీసుకోనున్నారు సీఎం జగన్. ఈ క్రమంలో 11న కొలువుదీరనుంది కొత్త కేబినెట్. అదే రోజు కొత్త మంత్రులు, పాత మంత్రులకు సీఎం విందు ఇవ్వనున్నారు. కొత్త మంత్రులకు ఒక రోజు ముందుగా మాత్రమే సమాచారం ఇవ్వనున్నారు.
కాగా.. మంత్రివర్గంలో చేయబోయే మార్పుల గురించి సీఎం జగన్ ఓ క్లారిటీకి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో మంత్రివర్గంలో ప్రస్తుతం ఉన్నవారిలో ఎవరెవరరూ బెర్త్‌లు కోల్పోనున్నారు..? కొత్తగా అవకాశం దక్కించుకునేవారు ఎవరనేదానిపై వైసీపీ సర్కిల్స్‌లో తెగ చర్చ సాగుతుంది. మంత్రివర్గంలో నుంచి ఉద్వాసన తప్పదేమోనని చాలా మంది మంత్రులు టెన్షన్ పడుతున్నట్టుగా చెబుతున్నారు. మరోవైపు చాలా కాలంగా మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న నేతలు మాత్రం తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. 2019లో సీఎంగా బాధ్యతలు చేపట్టిన సీఎం జగన్.. అప్పుడు ఏర్పాటు చేసిన మంత్రివర్గం రెండున్నర ఏళ్లు మాత్రమే ఉంటుందని చెప్పారు. రెండున్నరేళ్ల తర్వాత కొత్తవారికి కేబినెట్‌లో చోటు కల్పిస్తానని అన్నారు. దాదాపు 90 శాతం మంది మంత్రులను మార్చి.. తొలి విడుతలో అవకాశం దక్కనివారికి అవకాశం కల్పిస్తానని సీఎం జగన్ చెప్పారు. ఇప్పుడే ఆ దిశలోనే మార్పులు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయని వైసీపీ వర్గాలు తెలిపాయి.
అంతకుముందు వైఎస్ఆర్‌ఎల్పీ (ysrcp legislative meeting) సమావేశంలో సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్ నుంచి గడప గడపకు వైఎస్సార్‌సీపీ కార్యక్రమం ఉంటుందని చెప్పారు. ఇక మంత్రి వర్గంలో మార్పులపై (ap cabinet reshuffle) మరోసారి స్పష్టత ఇచ్చారు జగన్. కేబినెట్‌లో నుంచి తొలగించిన వారికి పార్టీ బాధ్యతలు, జిల్లా అధ్యక్ష పదవులు, అలాగే రీజినల్ కో ఆర్డినేటర్ బాధ్యతలు అప్పగిస్తామని జగన్ చెప్పారు. మీరు గెలిచి, పార్టీని గెలిపించుకుని రావాలని.. అప్పుడు మళ్లీ అవకాశాలు వస్తాయని అన్నారు. రెండు సంవత్సరాల్లో ఈ పరీక్షా సమయం రాబోతోందని చెప్పారు. ఎవరు పనితీరు చూపించకపోయినా సరే.. ఉపేక్షించేది లేదని వార్నింగ్ ఇచ్చారు జగన్. ఇంటింటికి వెళ్లకపోతే సర్వేల్లో పేర్లు రావని హెచ్చరించారు. సర్వేల్లో రాకపోతే.. మొహమాటం లేకుండా టికెట్లు ఇవ్వబోనని తేల్చిచెప్పారు.
ఇప్పుడు మంత్రులుగా వచ్చే వారు మళ్లీ పార్టీ బాధ్యతలు తీసుకోవాలని తెలిపారు జగన్. తలా ఒక చేయి వేస్తేనే మనం గెలుస్తామని, అధికారంలోకి వస్తామని చెప్పారు. తప్పదు అనుకున్న చోట.. కొన్ని సామాజిక సమీకరణాల వల్ల కొన్ని కొన్ని మినహాయింపులు మంత్రివర్గ పునర్వ్యస్థీకరణలు వుంటాయని చెప్పారు. చేసిన పనిని ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతే అది తప్పే అవుతుందని.. గోబెల్స్ ప్రచారంపై అలర్ట్‌గా వుండాలన్నారు. 26 కొత్త జిల్లాలకు అధ్యక్షులను తీసుకుంటామని.. ఇప్పటివరకూ ఎలా ఉన్నా, ఇకపై ముందుకు కదలాలని జగన్ సూచించారు. తప్పుడు ప్రచారాలను కౌంటర్ చేసే ఆయుధాలను కార్యకర్తల చేతిలో పెట్టాలని.. ఏమీ లేకపోయినా ఏదో జరుగుతుందనే భ్రమ కల్పిస్తారని సీఎం స్పష్టం చేశారు.
మరోవైపు.... 2024 అసెంబ్లీ ఎన్నికలకు సిద్దమవుతున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతికి ఎమ్మెల్యేల పనితీరు, గెలుపు అవకాశాలకు సంబంధించిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అదినట్లు సమాచారం. ఇదే ఇప్పుడు వైసిపి (ysrcp) ఎమ్మెల్యేలను టెన్షన్ పెడుతోంది. ఈ రిపోర్ట్ ఆధారంగా దాదాపు 50మంది వైసిపి ఎమ్మెల్యేలపై పార్టీ అధినేత గుర్రుగా వున్నట్లు సమాచారం. వివిధ కారణాలతో ప్రజలు తిరస్కరించే అవకాశాలున్నాయని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా తేలడంతో దాదాపు 50మంది ఎమ్మెల్యేలపై వేటు వేసేందుకు వైసిపి అధినేత సిద్దమయినట్లు సమాచారం.