సహజీవనం చేసిన యువకుడిపై మహిళ యాసిడ్ దాడి.. గుంటూరులో ఘటన.. ఏం జరిగిందంటే ?

By Asianet News  |  First Published Oct 4, 2023, 6:53 AM IST

ఓ వివాహిత యువకుడిపై యాసిడ్ తో దాడి చేసింది. ఈ ఘటన ఏపీలోని గుంటూరు జిల్లాలో జరిగింది. ఇది స్థానికంగా చర్చనీయాంశం అయ్యింది. బాధితుడు ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు.


గుంటూరులో దారుణం జరిగింది. గతంలో సహజీవనం చేసిన యువకుడిపై ఓ మహిళ యాసిడ్ తో దాడి చేసింది. దీంతో ఆ యువకుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు అతడిని హాస్పిటల్ లో చేర్పించారు. ప్రస్తుతం బాధతుడు చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

బాధితుడు, పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా కేంద్రంలోని ఓ వాటర్ ప్లాంట్ లో ఓర్పు వెంకటేష్ అనే యువకుడు పని చేస్తున్నాడు. ప్రతీ రోజూ వాటర్ ప్లాంట్ ను నుంచి వాటర్ క్యాన్ లను తీసుకెళ్లి ఇంటింటికి చేరే వేసే పని ఆ యువకుడిది. ఈ క్రమంలో కొంత కాలం కాలం కిందట రామిరెడ్డితోటలో నివసించే రాధ అనే మహిళతో వెంకటేష్ తో పరిచయం కలిగింది. ఆమె స్వస్థలం తెలంగాణలోని ఖమ్మం జిల్లా వైరా ప్రాంతం. ఆ మహిళకు గతంలోనే వివాహమైంది. కానీ భర్త లేడు. దీంతో ఆమె గుంటూరులోని రామిరెడ్డి తోటలో నివసిస్తూ జీవనోపాధి కోసం స్థానికంగా ఉండే ఇళ్లలో పని చేస్తూ ఉంటుంది. 

Latest Videos

అయితే వెంకటేష్ కు, ఆమెకు సాన్నిహిత్యం పెరిగింది. ఈ నేపథ్యంలో రాధను ఆ యువకుడు మూడు నెలల కిందట తన నివాసానికి తీసుకెళ్లాడు. అప్పటి నుంచి వారిద్దరూ అక్కడే ఉంటున్నారు. అయితే ఆ మహిళను ఇంటికి తీసుకురావడం వెంకటేష్ కుటుంబ సభ్యులకు నచ్చలేదు. దీంతో ఆమెను ఇంట్లో నుంచి పంపించారు. దీంతో ఆగ్రహం చెందిన రాధ.. వెంకటేష్, అతడి కుటుంబీకులు తనను కొట్టారని, దీంతో గాయాలు అయ్యాయని పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

ఆమె ఫిర్యాదుతో పోలీసులు ఆ యువకుడిపై అలాగే మరో ముగ్గురిపై కేసు నమోదు చేశారు. ఇంటి నుంచి పంపించివేయడంతో కక్ష పెంచుకున్న రాధ యువకుడిపై కోపం తీర్చుకోవాలని అనుకుంది. అందులో భాగంగానే మంగళవారం ముగ్గురు యువకులను తీసుకొని ఆటోలో వెంకటేష్ వాటర్ క్యాన్ లు వేస్తున్న ప్రాంతానికి వెళ్లింది. ఆ యువకుడు వాటర్ క్యాన్ లు దించుతున్న సమయంలో వెనకాల నుంచి వెళ్లి యాసిడ్ పోసింది. అనంతరం అదే ఆటోలోనే పారిపోయింది. 

అయితే యాసిడ్ దాడి జరగడంతో కేకలు వేయడం ప్రారంభించాడు. స్థానికులు గమనించి అతడిని జీజీహెచ్ కు తీసుకొని వెళ్లారు. దీనిపై పోలీసులకు సమచారం అందింది. దీంతో నిందితురాలు రాధ, అలాగే ఆమెకు సహాయం చేసిన ముగ్గురు యువకులపై కేసు బుక్ చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

click me!