ఇన్నర్ రింగ్ రోడ్ కేసు.. చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్

By Siva KodatiFirst Published Oct 3, 2023, 6:20 PM IST
Highlights

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. దీనిపై తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు తెలిపింది న్యాయస్థానం . 

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం తీర్పును న్యాయస్థానం రిజర్వ్ చేసింది. చంద్రబాబు తరపున సిద్ధార్ధ్ లూథ్రా వర్చువల్‌గా వాదనలు వినిపించగా.. సీఐడీ తరపున ఏజీ శ్రీరామ్ వాదించారు. 

ఇకపోతే.. ఇదే కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సీఐడీ విచారణను అక్టోబర్ 10కి వాయిదా వేయాలని హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో లోకేష్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై హైకోర్టులో మంగళవారం విచారణ జరిపింది. సీఐడీ ఇచ్చిన 41ఏ నోటీసులో నిబంధనలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ నారా లోకేష్ లంచ్ మోషన్ వేశారు.

Latest Videos

ALso Read: చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ వాయిదా.. హైకోర్టులో దాఖలు చేసిన పత్రాలు సమర్పించాలని సుప్రీం ఆదేశం..

ఆయన తరపున పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. హెరిటేజ్‌లో లోకేష్ షేర్ హోల్డర్ అని.. ఆయనకు తీర్మానాలు ఇవ్వాలన్నా, బ్యాంక్ అకౌంట్ల వివరాలు ఇవ్వాలన్న కంపెనీకి ప్రొసీజర్ వుంటుందని ఆయన న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు.. తాము డాక్యుమెంట్లు సమర్పించాలన్న దానిపై ఎలాంటి ఒత్తిడి వేయబోమని సీఐడీ తరపు న్యాయవాదులు పేర్కొన్నారు. 

click me!