TTD: తిరుమలలో పెరుగుతున్న భ‌క్తుల ర‌ద్దీ.. కాలిబాటలపై కొన‌సాగుతున్న ఆంక్ష‌లు

By Mahesh Rajamoni  |  First Published Oct 3, 2023, 5:07 PM IST

Tirumala: పవిత్ర భాద్ర‌ప‌ద మాసం, వరుస సెలవుల కారణంగా గత నాలుగు రోజులుగా తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగిందని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు.  అయితే, భక్తుల భద్రతకు పెద్దపీట వేస్తున్నామనీ, వారి ర‌క్ష‌ణ కోసం అన్ని ర‌కాల చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని పేర్కొన్నారు. కొన్ని నెలల క్రితం అలిపిరి ట్రెక్కింగ్ మార్గంలో ఆరేళ్ల బాలికపై చిరుత దాడి చేసిన తర్వాత 12 ఏళ్ల లోపు పిల్లల ట్రెక్కింగ్ కు టీటీడీ అనుమతి నిలిపివేసిన విషయాన్ని సైతం ప్ర‌స్తావించారు.
 


Tirumala Tirupati Devasthanams: పవిత్ర భాద్ర‌ప‌ద మాసం, వరుస సెలవుల కారణంగా గత నాలుగు రోజులుగా తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగిందని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు.  అయితే, భక్తుల భద్రతకు పెద్దపీట వేస్తున్నామనీ, వారి ర‌క్ష‌ణ కోసం అన్ని ర‌కాల చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని పేర్కొన్నారు. కొన్ని నెలల క్రితం అలిపిరి ట్రెక్కింగ్ మార్గంలో ఆరేళ్ల బాలికపై చిరుత దాడి చేసిన తర్వాత 12 ఏళ్ల లోపు పిల్లల ట్రెక్కింగ్ కు టీటీడీ అనుమతి నిలిపివేసిన విషయాన్ని సైతం ప్ర‌స్తావించారు.

తిరుమల కాలిబాటలపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. అటవీ శాఖ అనుమతి తర్వాతే 12 ఏళ్లలోపు పిల్లలకు సమయ ఆంక్షలను సడలిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మ‌న్ భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు. అలిపిరి ఫుట్ పాత్ మార్గంలో వన్యప్రాణుల నుంచి ఎలాంటి ముప్పు లేదని అటవీ శాఖ నిర్ధారించిన తర్వాతే ఈ పని చేస్తామని చెప్పారు. గురువారం సాయంత్రం నుంచి తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుండగా, వారాంతమంతా కొనసాగిన నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. సోమవారం గోగర్భం సర్కిల్ నుంచి కృష్ణతేజ గెస్ట్ హౌస్ సర్కిల్ వరకు క్యూలైన్లను పరిశీలించి భక్తులకు ఆహారం, తాగునీరు, శీతల పానీయాలు వంటి అన్ని సౌకర్యాలు అందేలా చూడాలన్నారు.

Latest Videos

undefined

పవిత్ర భాద్ర‌ప‌ద మాసం, వరుస సెలవుల కారణంగా గత నాలుగు రోజులుగా తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగిందని టీటీడీ చైర్మన్ తెలిపారు. క్యూలైన్లు 5 కిలోమీటర్ల వరకు విస్తరించాయి. దీనికి ప్రతిస్పందనగా టీటీడీ సాధారణ భక్తులకు శీఘ్ర దర్శనం కోసం వీఐపీ బ్రేక్, సుపథం, టైమ్ స్లాట్ చేసిన సర్వదర్శనం టోకెన్లను రద్దు చేసింది. సుదీర్ఘ క్యూలైన్లు ఉన్నప్పటికీ సౌకర్యాలు, ఏర్పాట్లపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారని టీటీడీ చైర్మన్ తెలిపారు. అయితే, మ‌రింత‌గా మెరుగైన చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని పేర్కొన్నారు.

ఈ నెల 15 నుంచి 23వ తేదీ వరకు జరిగే నవరాత్రి బ్రహ్మోత్సవాలకు టీటీడీ సన్నద్ధమవుతోందనీ, ఈ నేపథ్యంలో భక్తులు భారీగా వస్తారని తెలిపారు. ఈవో ధర్మారెడ్డి, జేఈవో వీరబ్రహ్మం, సీవీఎస్ వో నరసింహకిషోర్ ఆధ్వర్యంలో నాలుగు రోజులుగా టీటీడీ సిబ్బంది అందిస్తున్న సేవలను ఆ సంద‌ర్భంగా కొనియాడారు.

click me!