ప్రియుడిపై మోజు: కొడుకును చంపి పూడ్చిన కసాయి తల్లి

Published : Oct 07, 2020, 05:38 PM IST
ప్రియుడిపై మోజు: కొడుకును చంపి పూడ్చిన కసాయి తల్లి

సారాంశం

అక్రమ సంబంధానికి అడ్డు ఉన్నాడనే కోపంతో ఓ కసాయి తల్లి తన కన్నకొడుకుని ప్రియుడితో కలిసి చంపేసింది. ఈ సంఘటన కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలో జరిగింది. 

విజయవాడ: పేగు తెంచుకుని పుట్టిన కుమారుడి పట్ల ఓ కసాయి తల్లి అత్యంత దారుణమైన సంఘటనకు ఒడిగట్టింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లిలో ఈ సంఘటన జరిగింది. ప్రియుడితో కలిసి ఏడాదిన్నర వయస్సు గల కుమారుడిని చంపేసింది.

ఆ తర్వాత ఇద్దరు కలిసి పసివాడి శవాన్ని తెలంగాణలోని కోదాడ సమీపంలో పూడ్చిపెట్టారు.  పిల్లవాడి తల్లిని ఉషాగా, ఆమె ప్రియుడిని శ్రీనుగా పోలీసులు గుర్తించారు. వారిద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

స్థానికులకు అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో ఆ ఘటన వెలుగులోకి వచ్చింది. తెలంగాణ, ఏపీ సరిహద్దులో శవం పూడ్చిన స్థలం ఉండడంతో కేసు దర్యాప్తు విషయంలో కాస్తా జాప్యం జరిగింది.

ఉషా రెండు నెలల క్రితం భర్తతో విడిపోయినట్లు తెలుస్తోంది. ఉషా కుటుంబ సభ్యులు తెలంగాణకు చెందినవారని సమాచారం. భర్తతో విడిపోయిన తర్వాత మహిళ బంధువులకు దూరంగా ఉంటూ వస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఆమెకు శ్రీనుతో వివాహేతర సంబంధం ఏర్పడింది. 

ఉషా పిల్లలపై ద్వేషం పెంచుకుందని అంటున్నారు. పిల్లలకు వాతలు పెడుతూ వారిని చిత్రహింసలకు గురి చేసేదని అంటున్నారు. ఏడాదిన్నర కొడుకుకి చిత్రహింసలు పెడుతూ అన్నం తినిపించిందని, మరోసారి కూడా కుమారుడిని కొట్టడంతో అతను మరణించాడని తెలుస్తోంది.

PREV
click me!

Recommended Stories

IAS Amrapali Kata Speech: విశాఖ ఉత్సవ్ లో ఆమ్రపాలి పవర్ ఫుల్ స్పీచ్ | Asianet News Telugu
Visakha Utsav Curtain Raiser Event: హోం మంత్రి అనిత సెటైర్లు | Asianet News Telugu