ఏపీలో కరోనా తగ్గుముఖం: కొత్తగా 5,120 కేసులు.. పెరుగుతున్న రికవరీలు

Siva Kodati |  
Published : Oct 07, 2020, 05:27 PM ISTUpdated : Oct 07, 2020, 05:31 PM IST
ఏపీలో కరోనా తగ్గుముఖం: కొత్తగా 5,120 కేసులు.. పెరుగుతున్న రికవరీలు

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా జోరు కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 5,120 కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 7,34,427కి చేరుకుంది.

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా జోరు కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 5,120 కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 7,34,427కి చేరుకుంది.

నిన్న వైరస్ కారణంగా 34 మంది ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మృతుల సంఖ్య 6,086కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 49,513 యాక్టివ్ కేసులున్నాయి. గత 24 గంటల్లో 6,349 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అవ్వడంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 6,78,828కి చేరింది.

నిన్న ఒక్కరోజే 66,769 శాంపిల్స్‌ను పరీక్షించడంతో మొత్తం టెస్టుల సంఖ్య 62,83,009కి చేరుకుంది. అనంతపురం 424, చిత్తూరు 807, తూర్పు  గోదావరి 807, గుంటూరు 433, కడప 301, కృష్ణ 464, కర్నూలు 144, నెల్లూరు 367, ప్రకాశం 264, శ్రీకాకుళం 172, విశాఖపట్నం 190, విజయనగరం 172, పశ్చిమ గోదావరిలలో 575 కేసులు నమోదయ్యాయి.

కరోనా కారణంగా తూర్పుగోదావరి 5, అనంతపురం 4, చిత్తూరు 4, కృష్ణ 4, విశాఖపట్నం 4, గుంటూరు 3, నెల్లూరు 3, కడప 2, కర్నూలు 2, పశ్చిమ గోదావరి 2, ప్రకాశంలలో ఒక్కరు చొప్పున మరణించారు. 

PREV
click me!

Recommended Stories

Weather Update: ఏపీ, తెలంగాణలో మారిన వాతావరణం.. 15 జిల్లాలకు హై అలర్ట్.. అక్కడ తుపాను గండం
అమరావతిని ఇంచు కూడా కదిలించలేవు జగన్ | CBN Massive Speech | Asianet Telugu