కాకినాడ: టిడిపికి గెలుపు అంత ఈజీ కాదు

Published : Aug 26, 2017, 11:33 AM ISTUpdated : Mar 25, 2018, 11:58 PM IST
కాకినాడ: టిడిపికి గెలుపు అంత ఈజీ కాదు

సారాంశం

ప్రధాన ప్రతిపక్షం వైసీపీ బలమైన శత్రువుగా ఉండటం ఒక ఎత్తైతే పార్టీలోని అంతర్గత కుమ్ములాటలు మరో ఎత్తుగా ఉంది. దాంతో టిడిపి రెండు రకాలుగానూ పోరాటం చేయాల్సి వస్తోంది. అందుకే చంద్రబాబునాయుడు ప్రతీ రోజూ కాకినాడలోని నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. అంతర్గత సమస్యల పరిష్కారానికి ఎప్పటికిప్పుడు మార్గాలను సూచిస్తున్నారు. ఇందులో భాగంగానే శనివారం కాకినాడకు వెళుతున్నారు.

కాకినాడ కార్పొరేషన్లో గెలవటం టిడిపికి అనుకున్నంత ఈజీ కాదు. ప్రధాన ప్రతిపక్షం వైసీపీ బలమైన శత్రువుగా ఉండటం ఒక ఎత్తైతే పార్టీలోని అంతర్గత కుమ్ములాటలు మరో ఎత్తుగా ఉంది. దాంతో టిడిపి రెండు రకాలుగానూ పోరాటం చేయాల్సి వస్తోంది. అందుకే చంద్రబాబునాయుడు ప్రతీ రోజూ కాకినాడలోని నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. అంతర్గత సమస్యల పరిష్కారానికి ఎప్పటికిప్పుడు మార్గాలను సూచిస్తున్నారు. ఇందులో భాగంగానే శనివారం కాకినాడకు వెళుతున్నారు.

ఈరోజు విజయవాడలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు పౌరసన్మానం పూర్తికాగానే వెంటనే కాకినాడకు బయలుదేరుతున్నారు. 29వ తేదీ పోలింగ్ ఉన్నందున ఆదివారంతో ప్రచారం ముగించాల్సి ఉంటుంది. అందుకే మొత్తం ఐదు చోట్ల రోడ్డుషో కమ్ బహిరంగ సమావేశాల్లో పాల్గొంటున్నారు. సరే, వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అనారోగ్య కారణాలతో కాకినాడకు వెళ్లలేకపోవటం తమకు బాగా కలసి వస్తుందని టిడిపి నేతలు అనుకుంటున్నారు. నంద్యాల దెబ్బకు టిడిపి నేతలు అలా అనుకోవటంలో తప్పూ లేదు.

ఇక కాకినాడ అన్నది ప్రధానంగా కాపుల గడ్డ. కాపు రిజర్వేషన్ ఉద్యమానికి, ముద్రగడ ఆందోళనలకు కాకినాడే ప్రధాన కేంద్రమన్న సంగతి అందరికీ తెలిసిందే. ఎందుకంటే, ముద్రగడ సొంతూరు కిర్లంపూడి కాకినాడకు దగ్గర్లోనే ఉండటం కూడా కాకినాడలో ఉద్యమం తారా స్ధాయికి చేరుకోవటానికి ప్రధాన కారణమైంది.

అందుకే మెజారిటీ కాపులు చంద్రబాబు అంటే మండిపడుతున్నారు. మొత్తం 2.36 లక్షల ఓట్లలో కాపుల ఓట్లే 45 వేలున్నాయి. అంటే ఓ పార్టీ గెలుపోటముల్లో కాపుల  ఓట్లు ఎంత కీలకమో అర్ధమవుతోంది.

ఇదికాకుండా టిడిపిలోనే అంతర్గత శత్రువులు ఇంకో కారణం. అంటే 48 డివిజన్లలో 26 డివిజన్లలో రెబల్స్ గట్టి పోటీ ఇస్తున్నారు. వీరిని విత్ డ్రా చేయించేందుకు మంత్రులు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. దానికితోడు భారతీయ జనతా పార్టీకి కేటాయించిన 9 వార్డుల్లో కూడా ఏడు చోట్ల టిడిపి అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. ఇది ఇంకో సమస్యగా తయారైంది.

ఇవన్నీ కాకుండా ఎంఎల్ఏలు కొండబాబు(వెంకటేశ్వర్రావు)పిల్లి అనంతలక్ష్మిలపై జనాల్లో ఉన్న వ్యతిరేకత బోనస్ అనే అనుకోవాలి. దాంతో కాకినాడ కార్పొరేషన్లో గెలుపుకు టిడిపి నానా అవస్తలు పడుతున్నది. మరి, తన పర్యటనలో చంద్రబాబు ఏం మ్యాజిక్ చేస్తారో చూడాలి.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!
Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్