Raghu Rama: వైసీపీకి రాజీనామా చేస్తా.. తాడేపల్లిగూడెం సభకు హాజరవుతా: ఎంపీ రఘురామ

By Mahesh K  |  First Published Feb 23, 2024, 7:38 PM IST

నరసాపురం ఎంపీ, వైసీపీ రెబల్ లీడర్ రఘురామ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను వైసీపీకి గుడ్ బై చెప్పడానికి సమయం వచ్చిందని, మరో ఒకట్రెండు రోజుల్లో వైసీపీకి రాజీనామా చేస్తానని వివరించారు. విపక్ష కూటమి నుంచి మరోసారి లోక్ సభకు పోటీ చేస్తానని తెలిపారు.
 


MP Raghu Rama: నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను వైసీపీకి గుడ్ బై చెబుతానని వివరించారు. వైసీపీకి రాజీనామా చేయడానికి ముహూర్తం నిర్ణయం చేసుకున్నట్టు తెలిపారు. ఒకటి రెండు రోజుల్లో తాను రాజీనామా చేస్తానని పేర్కొన్నారు. అంతేకాదు, వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మళ్లీ పోటీ చేస్తానని వివరించారు.

విపక్ష కూటమి నుంచి తాను లోక్ సభ ఎన్నికల బరిలో నిలబడుతున్నట్టు ఎంపీ రఘురామ వెల్లడించారు. ఏ పార్టీ టికెట్ పై బరిలోకి దిగుతారనే విషయంపై ఆయన స్పష్టత ఇవ్వలేదు. మొత్తానికి ప్రతిపక్ష శిబిరం నుంచి పోటీ చేస్తానని వివరించారు. అంతేకాదు, ఈ నెల 28వ తేదీన టీడీపీ, జనసేన సంయుక్తంగా నిర్వహించతలపెట్టిన ఉమ్మడి భారీ బహిరంగ సభలోనూ తాను పాల్గొంటానని వెల్లడించారు.

Latest Videos

2019లో లోక్ సభకు వైసీపీ టికెట్ పై ఎన్నికైన రఘురామకృష్ణం రాజు ఆ తర్వాత జగన్ పార్టీకి దూరమయ్యారు. అప్పటి నుంచి రెబల్‌గానే ఉన్నారు. వైసీపీ పైనే తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్నారు. అంతేకాదు, ప్రతిపక్షంతోనూ సన్నిహిత సంబంధాలు ఏర్పరుచుకున్నారు.

Also Read: Lasya Nandita: పాడే మోసిన హరీశ్ రావు.. వీడియో వైరల్

టీడీపీ, జనసేన పార్టీలు రాష్ట్రస్థాయి ఉమ్మడి సమన్వయ సమావేశాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే. ఉమ్మడి మ్యానిఫెస్టోను త్వరలోనే విడుదల చేస్తామని, 28వ తేదీన తాడేపల్లి గూడెంలో భారీ బహిరంగ సభ ఉమ్మడిగా నిర్వహిస్తామని టీడీపీ, జనసేన పార్టీలు ప్రకటించాయి. అయితే.. ఇందులో బీజేపీ ప్రమేయంపై స్పష్టత లేదు.

click me!