ఈ నెల 11న మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటన సందర్భంగా ఆ సభకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను పిలుస్తారా అన్న ప్రశ్నకు.. సోము వీర్రాజు మౌనం వహించారు.
విశాఖపట్నం : జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఏపీ బీజేపీ నేతలకు దూరం పెరిగిందా? అనే చర్చ సర్వత్రా నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమూ వీర్రాజు వైఖరి ఈ అనుమానాలకు తావిచ్చేలా ఉంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికే బీజేపీ కట్టుబడి ఉందని ఈ విషయంలో మరో వివాదానికి తావు లేదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. మూడు రాజధానుల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న వైసీపీని ప్రశ్నించాలని మీడియా ప్రతినిధులకు ఆయన సూచించారు. విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో సోము వీర్రాజు మాట్లాడారు.
ఈనెల 11న విశాఖలో ప్రధాని మోడీ పర్యటించనున్న సందర్భంగా ఈ పర్యటన వివరాలను ఎంపీ జీవీఎల్ నరసింహారావు తో కలిసి సోము వీర్రాజు వెల్లడించారు. ఈ పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మోడీ శంకుస్థాపన చేస్తారని తెలిపారు. ప్రధాని పర్యటన వివరాలను వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ముందే ప్రకటించారు కదా అని ఆయనను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. కేంద్రం చేస్తున్న అభివృద్ధిపై క్రెడిట్ కొట్టేసేందుకు వైసీపీ ఉబలాటపడుతోందని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. ప్రధాని సభకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఆహ్వానిస్తారా? అని ప్రశ్నించగా సోము వీర్రాజు సమాధానం చెప్పలేదు. విశాఖపట్నంలో అభివృద్ధి అంతా కేంద్ర ప్రభుత్వం నిధులతోనే జరుగుతోందని జీవీఎల్ అన్నారు.
‘కుండబద్దలు’ యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు సుబ్బారావుకు పోలీసుల నోటీసులు