మీ రాజకీయ ప్రతీకార చర్యల్లోకి న్యాయస్థానాలను లాగొద్దు - సుప్రీంకోర్టు

By team teluguFirst Published Nov 8, 2022, 6:54 AM IST
Highlights

రాజకీయ ప్రతీకారాల్లో న్యాయస్థానాలను లాగకూడదని సుప్రీంకోర్టు తెలిపింది. అమరావతి రింగ్‌రోడ్‌ డిజైన్‌ కేసులో మాజీ మంత్రి, ఇతర నిందితులకు హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ సందర్భంగా కోర్టు ఇలా వ్యాఖ్యానించింది. 

రాజకీయ ప్రతీకారాల్లో న్యాయస్థానాలను భాగస్వాములు చేయొద్దని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. తాము అందులో ఉండదల్చుకోవడం లేదని తెలిపింది. అమరావతి రింగ్‌రోడ్‌ డిజైన్‌ కేసులో మాజీ మంత్రులు పి.నారాయణ, ఎల్‌.రమేష్‌, ఎల్‌.రాజశేఖర్‌, కెపివి అంజనీకుమార్‌లకు ముందస్తు బెయిల్‌ రద్దు చేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. దానిని అత్యున్నత న్యాయస్థానం రద్దు చేస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. 

శ్రీకాకుళంలో అమానవీయ ఘటన: ఇద్దరు మహిళలపై ట్రాక్టర్ తో కంకర పోసిన దుండగులు

నిందితులు విచారణకు సహకరించకుంటే ఏపీ హైకోర్టును ఆశ్రయించాలని, హైకోర్టులో వారి ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని కోరాలని ఏపీ సీఐడీకి సుప్రీంకోర్టు సూచించింది. “నిందితులు విచారణకు సహకరించకపోతే వారి బెయిల్ రద్దు చేయాలని మీరు (ప్రభుత్వం) హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయవచ్చు. దయచేసి మీ రాజకీయ ప్రతీకార చర్యలో సుప్రీం కోర్టును లాగవద్దు” అని ధర్మాసనం పేర్కొంది.

ఏపీ ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది హరీన్ రావల్ వాదనలు వినిపిస్తూ.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ముందస్తు బెయిల్ ఏపీ చేస్తూ.. ఏపీసీఆర్‌డీఏ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద ప్రాసిక్యూషన్ ప్రారంభించడం చట్టపరంగా సరైనది కాదని అన్నారు. ఆరేళ్ల జాప్యాన్ని పరిగణనలోకి తీసుకుని హైకోర్టు కేసును తప్పుగా పరిగణించిందని. అయితే 2018లో మాత్రమే ఇన్నర్ రింగ్ రోడ్డు నోటిఫై చేయబడిందని ఆయన తెలిపారు. 

తాళ్లరేపు జూనియర్ కాలేజీ పనుల్లో జాప్యం:ఇంజనీర్ పై సస్పెన్షన్ కు కలెక్టర్ ఆదేశం

నిందితులు చేసిన నేరాలకు సంబంధించి నిర్దిష్ట వివరాలు ఉన్నప్పటికీ, నిందితులపై ఎలాంటి మెటీరియల్ లేదని ఏపీ హైకోర్టు తప్పుగా గుర్తించిందని ఆయన సుప్రీంకోర్టుకు తెలియజేశారు. నిందితులకు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన తర్వాత దర్యాప్తు సంస్థ స్పందించడం లేదని ఆయన సుప్రీంకోర్టుకు నివేదించారు.

ఈ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానిస్తూ.. ముందస్తు బెయిల్ దరఖాస్తులో హైకోర్టు పరిశీలనలు కొనసాగుతున్న దర్యాప్తుపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపబోవని తెలిపారు. దర్యాప్తు సంస్థ కూడా హైకోర్టును ఆశ్రయించవచ్చని పేర్కొంది. నిందితులు విచారణకు సహకరించకపోతే ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని చెప్పింది. కాగా.. ఇన్నర్ రింగ్ రోడ్ (ఐఆర్‌ఆర్) ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (సీఐడీ) నమోదు చేసిన కేసులో మాజీ మంత్రి పి నారాయణ, ఇతర నిందితులకు సెప్టెంబర్ 6న హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

ఖమ్మంలో ఘోరం.. కూతురి మృతదేహాన్ని 68 కిలోమీటర్లు బైక్‌పై తీసుకెళ్లిన గిరిజన దంపతులు

ఐఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్‌ను మార్చడం వల్ల రైతులకు అన్యాయం జరిగిందని, ఇతరులకు ఆర్థిక లబ్ధి చేకూరిందంటూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి పి.నారాయణ, రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్, కేపీవీ అంజనీకుమార్, లింగమనేని రమేష్, లింగమనేని వెంకట సూర్య రాజశేఖర్‌లను నిందితులుగా సీఐడీ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. 

click me!