ఇపుడన్నా చంద్రబాబు ఓకే చెబుతారా ?

First Published Oct 25, 2017, 9:09 AM IST
Highlights
  • ఈరోజన్నా అమరావతిలో నిర్మించనున్న అసెంబ్లీ, హైకోర్టు భవనాల డిజైన్ ఖరారవుతుందా ?
  • ఎందుకంటే, విదేశీ పర్యటనలో ఉన్న చంద్రబాబునాయుడు బృందం మంగళవారం బ్రిటన్ వెళ్ళి ఆర్కిటెక్ట్ నార్మన్ ఫోస్టర్ బృందంతో చర్చలు జరిపింది.
  • హై కోర్టు, అసెంబ్లీ భవనాల కోసం ఫోస్టర్ తాజాగా ఇచ్చిన డిజైన్లను చంద్రబాబు, రాజమౌళి తదితరులు పరిశీలించారు.

ఈరోజన్నా అమరావతిలో నిర్మించనున్న అసెంబ్లీ, హైకోర్టు భవనాల డిజైన్ ఖరారవుతుందా ? ఎందుకంటే, విదేశీ పర్యటనలో ఉన్న చంద్రబాబునాయుడు బృందం మంగళవారం బ్రిటన్ వెళ్ళి ఆర్కిటెక్ట్ నార్మన్ ఫోస్టర్ బృందంతో చర్చలు జరిపింది. హై కోర్టు, అసెంబ్లీ భవనాల కోసం ఫోస్టర్ తాజాగా ఇచ్చిన డిజైన్లను చంద్రబాబు, రాజమౌళి తదితరులు పరిశీలించారు. అక్కడి నుండే సిఆర్డీఏ ఉన్నతాధాకారులతో వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. డిజైన్లను చూపించారు. ఆ సందర్భంగా రాజమైళి కొన్ని సూచనలు చేసారు. వాటి ప్రకారం డిజైన్లలో కొంత సరిచేయాలి. అవే డిజైన్లపై బుధవారం అంటే ఈరోజు చంద్రబాబు మళ్ళీ ఫాస్టర్ తో సమావేశమవుతున్నారు.

మరి, ఈరోజన్నా డిజైన్లను చంద్రబాబు ఖరారు చేస్తారా అన్నది తేలలేదు. ఎందుకంటే, గడచిన ఏడాదిన్నరగా ఫోస్టర్ ఇచ్చిన డిజైన్లే చంద్రబాబుకు నచ్చటం లేదు. అందుకనే ప్రత్యేకంగా సినీ దర్శకుడు రాజమళిని ఫోస్టర్ తో మాట్లాడించారు. సరే, అసెంబ్లీ అయినా, హై కోర్టయినా అందరికీ అనుమతి ఉండదన్న విషయం తెలిసిందే. అసెంబ్లీలోకి అయితే కేవలం అనుమతి ఉన్నవారు మాత్రమే ప్రవేశించగలరు. ఇక, హైకోర్టంటారా అవసరమైన వారు మాత్రమే వెళతారు. అటువంటి నిర్మాణాలను ప్రపంచంలోనే ఐకానిక్ భవనల్లో ఒకటిగా నిర్మించాలని అనుకోవటమేంటో అర్ధం కావటం లేదు. అసెంబ్లీ, హై కోర్టు భవనాలకు రెండేసి డిజైన్లను ఇచ్చారు ఫోస్టర్

సరే, ఎలాకట్టినా, ఎవరు కట్టినా అసలు రాజధానంటూ ఒకటి నిర్మాణమైతే అదే పదివేలన్నట్లుంది జనాల పరిస్ధితి. ఎందుకంటే, రాజధాని నిర్మాణమంటూ చంద్రబాబు మూడేళ్ళగా కాలక్షేపం చేస్తున్నారు. అమరావతిలో ప్రధానమంత్రి నరేంద్రమోడితో శంకుస్ధాపన చేయించి సరిగ్గా రెండేళ్ళు దాటింది. రెండేళ్ళల్లో ఒక్క ఇటుక కూడా లేవలేదు. మళ్ళీ త్వరలో ముందస్తు ఎన్నికలంటున్నారు. చూడబోతే అప్పటికేదో ఒక రకంగా రాజధాని నిర్మాణం ప్రారంభమైందనిపించి ఎన్నికలను ఎదుర్కోవాలన్నది చంద్రబాబు వ్యూహంగా కనబడుతోంది. ఏం జరుగుతుందో చూద్దాం..

 

click me!