ఉపఎన్నికలో గెలిచే సత్తా ఉందా?...

First Published Oct 25, 2017, 6:30 AM IST
Highlights
  •  ‘అశ్వత్థామ అతహ...కుంజరహ’ అన్న మాట మహాభారతంలో చాలా పాపులర్.
  • కురుక్షేత్ర యుద్దంలో ధర్మరాజు ఆ వాఖ్యాన్ని ఎందుకు, ఎప్పుడు, ఎలా వాడాడు అన్నది అందరికీ తెలిసిన విషయమే.
  • అదే విధంగా ఉంది మంత్రి ఆదినారాయణరెడ్డి రాజీనామా వ్యవహారం కూడా.

 ‘అశ్వత్థామ అతహ...కుంజరహ’ అన్న మాట మహాభారతంలో చాలా పాపులర్. కురుక్షేత్ర యుద్దంలో ధర్మరాజు ఆ వాఖ్యాన్ని ఎందుకు, ఎప్పుడు, ఎలా వాడాడు అన్నది అందరికీ తెలిసిన విషయమే. అదే విధంగా ఉంది మంత్రి ఆదినారాయణరెడ్డి రాజీనామా వ్యవహారం కూడా. తన రాజీనామాను స్పీకర్ ఆమోదిస్తే, ఉపఎన్నిక వస్తే సత్తా చాటడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.

‘రాజీనామాను ఆమోదిస్తే’..ఇక్కడే కండీషన్స్ అప్లై అవుతాయి. ఎందుకంటే, స్పీకర్ ఎప్పుడు రాజీనామాను ఆమోదించాలి? ఎప్పుడు ఉపఎన్నిక రావాలి? మీడియాతో మాట్లాడుతూ, తన గెలుపుపై తనకు బాగా నమ్మకముందన్నారు. వైసీపీ నుండి ఎంతమంది నేతలొచ్చినా తన గెలుపును ఆపలేరంటూ చెప్పుకొచ్చారు.

మంత్రి చెప్పింది అంతా బాగానే ఉంది. పోయిన ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ప్రస్తుతం చంద్రబాబు మంత్రి వర్గంలో ఉన్నారన్న విషయం అందరికీ తెలిసిందే కదా? టిడిపి తరపున జగన్మోహన్ రెడ్డిని తిట్టాలన్నా, ఆరోపణలు చేయాలన్నా చంద్రబాబునాయుడు మంత్రిని ఫుల్లుగా వాడేసుకుంటున్నారు.

అంతగా తన గెలుపుపై నమ్మకం ఉంటె రాజీనామా చేసింది నిజమైతే అధికారంలో ఉన్నది టీడీపీ పార్టీనే కదా? స్పీకర్ కూడా చంద్రబాబు కనుసన్నల్లో పనిచేసే వ్యక్తే కదా? ఓమాట చంద్రబాబుతో చెప్పించుకుని తన రాజీనామా ను ఆమోదింప చేసుకుంటే ఓ పనైపోతుంది కదా?

తర్వాత జరిగే ఉపఎన్నికలో సత్తా చాటితో మంత్రి ఆదినారాయణరెడ్డి నిజంగానే జిల్లాతో పాటు రాష్ట్రంలో కూడా హీరో అయిపోతాడు. ఎవరికైనా అనుమానాలున్నాయా ?

 

click me!