ఓట్లేయకపోతే సంక్షేమ పథకాలు రద్దేనా ?

First Published Aug 2, 2017, 7:46 AM IST
Highlights
  • ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలు అందుకుంటున్న వారు టిడిపికి ఎందుకు ఓట్లేయరంటూ దబాయించటం విచిత్రంగా ఉంది.
  • టిడిపికి ఓట్లేయకపోతే పింఛన్లు రద్దవుతాయని బెదిరించారు.
  • బోండా వరస చూస్తుంటే టిడిపి సొంత ఖాతాలో నుండి డబ్బులు తీసి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లుంది.

నంద్యాలలో తెలుగుదేశంపార్టీకి ఓట్లు వేయకపోతే సంక్షేమ పథకాలను రద్దు చేస్తారా? నేతల ప్రచారం చూస్తుంటే అదే అనుమానాలు మొదలయ్యాయి. విజయవాడ సెంట్రల్ ఎంఎల్ఏ బోండా ఉమ చెబుతున్న మాటలు అదే విధంగా ఉన్నాయి. నంద్యలలో ప్రచారం చేస్తున్న బోండా మాట్లాడుతూ, టిడిపికి ఓట్లేయకపోతే పింఛన్లు రద్దవుతాయని బెదిరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలు అందుకుంటున్న వారు టిడిపికి ఎందుకు ఓట్లేయరంటూ దబాయించటం విచిత్రంగా ఉంది.

బోండా వరస చూస్తుంటే టిడిపి సొంత ఖాతాలో నుండి డబ్బులు తీసి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లుంది. ‘ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా’ అన్న సామెతను టిడిపి నేతలు నిజం చేస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందుకుంటున్నవారు టిడిపికి ఎందుకు ఓట్లేయరంటూ ఆమధ్య స్వయానా చంద్రబాబానాయుడే జనాలను బహిరంగంగా ప్రశ్నించి సంచలనం రేపారు గుర్తుందా? ఇపుడదే వరసలో మంత్రులు, ఎంఎల్ఏలు, నేతలు కూడా తమ దబాయింపును కంటిన్యూ చేస్తున్నారు.

తన ప్రచారంలో బోండా ఇపుడు చేస్తున్నదదే. ఓట్ల కోసం జనాలను బెదిరిస్తున్నారు. సంక్షేమ ఫలాలు అందుకుంటున్నవారందరూ టిడిపికి ఓటు వేయాల్సిందేనంటూ హుకూం జారీచేసారు. నంద్యాల మున్సిపాలిటీలోని 24వ వార్డులో మంగళవారం ప్రచారం సందర్భంగా బోండా చేసిన వ్యాఖ్యలు, బెదిరింపులు తీవ్ర చర్చనీయాంశమైంది. ఓట్లు వేయకపోతే తీవ్ర పరిణామాలుంటాయని కూడా హెచ్చరించారు లేండి ఎంఎల్ఏ.

click me!