ఎంవోయులన్నీ బోగస్సేనా?

Published : Aug 01, 2017, 06:09 PM ISTUpdated : Mar 25, 2018, 11:41 PM IST
ఎంవోయులన్నీ బోగస్సేనా?

సారాంశం

పెట్టుబడుల పేరుతో రెండు సంవత్సరాల్లో చంద్రబాబునాయుడు చేసుకున్న ఒప్పందాల్లో అత్యధికం బోగస్సేనా? రాజ్యసభలో కేంద్రమంత్రి ఇచ్చిన సమాధానం చూస్తే ఎవరికైనా అదే అనుమానం వస్తుంది. రెండు సంవత్సరాల్లో చంద్రబాబు ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలపై వైసీపీ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి వేసిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. సమాధానం చూస్తే నోరెళ్లపెట్టాల్సిందే.

పెట్టుబడుల పేరుతో రెండు సంవత్సరాల్లో చంద్రబాబునాయుడు చేసుకున్న ఒప్పందాల్లో అత్యధికం బోగస్సేనా? రాజ్యసభలో కేంద్రమంత్రి ఇచ్చిన సమాధానం చూస్తే ఎవరికైనా అదే అనుమానం వస్తుంది. రెండు సంవత్సరాల్లో చంద్రబాబు ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలు తదితరాలపై వైసీపీ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి వేసిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. సమాధానం చూస్తే నోరెళ్లపెట్టాల్సిందే. ఎందుకంటే, 2016, 17 సంవత్సరాల్లో రాష్ట్రప్రభుత్వం పెట్టుబడుల కోసం దేశ, విదేశీ సంస్ధలతో భాగస్వామ్య సదస్సు నిర్వహిచింది భారీ ఎత్తున.

రెండు సదస్సుల్లో కలిపి సుమారు రూ. 15.33 లక్షల కోట్ల విలువైన ఎంవోయులు కుదుర్చుకున్నట్లు చంద్రబాబు ఎంతో ఘనంగా చెప్పుకున్నారో అప్పట్లో. నిజానికి అవన్నీ కార్యరూపం దాలిస్తే 1629 ప్రాజెక్టులు వచ్చుండాలి. అయితే, ఏ ప్రభుత్వంలోనూ అది సాధ్యం కాదు. కాబట్టి ప్రభుత్వాలు చెప్పుకున్నదాంట్లో కనీసం పావువంతు పెట్టుబడులు వచ్చినా, పరిశ్రమలు వచ్చినా చాలా గొప్పే. కేంద్ర ఆర్ధికశాఖ సహాయమంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ప్రకటన ప్రకారమైతే చాలా ఒప్పందాలు అసలు డిపిఆర్ (డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్) దశకూడా దాటలేదు.

2016 సదస్సులో రూ. 4,78,788 కోట్ల విలువైన 331 ఎంవోయులయ్యాయి. అయితే, రూ. 2,83,943 కోట్ల విలువైన 99 ఎంవోయులకు సంబంధించి ఇప్పటి వరకూ అసలు డిపిఆర్లే అందివ్వలేదట. అదే విధంగా మరో 6 ఎంవోయులను ప్రభుత్వమే వదులుకుంది. ఇక, 2017లో రూ. 10.54 లక్షల కోట్ల విలువైన 665 ఎంవోయులు కుదుర్చుకున్నది. వీటిల్లో 6.34 లక్షల కోట్ల విలువైన 335 ఎంవోయులపై ఇంత వరకూ డిపిఆర్లే అందలేదు.

అంతేకాకుండా రూ. 1.75 లక్షల విలువైన 12 ఎంవోయులను ప్రభుత్వమే వదులుకుంది. కేంద్రమంత్రి ఇన్ని చెప్పారు కానీ అసలు ఎన్ని ఎంవోయులకు డిపిఆర్లు వచ్చాయో చెప్పలేదు. అంటే ఒక్క ఎంవోయుకు కూడా డిపిఆర్ రాలేదా అన్న అనుమానాలు మొదలయ్యాయి. మరి చేసుకున్న ప్రచారమంతా ఏంటి? అంతా బోగస్సేనా? అంటే, చంద్రబాబు వల్ల ఖర్చు దండగ ఆర్భాటాలు తప్ప ఇంకేమీ జరుగుతున్నట్లు కనబడటం లేదు.

 

PREV
click me!

Recommended Stories

Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu
YS Jagan Birthday: తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో ఘనంగా జగన్ బర్త్ డే వేడుకలు| Asianet News Telugu