
‘ప్రజలకు సౌకర్యంగా ఉంటుందంటే వ్యభిచార గృహాలు కూడా నడుపుకోవచ్చా’? విజయవాడ ఎంపి కేశినేని నాని సూటిగా అడిగిన ప్రశ్న. స్లీపర్ బస్సులపై ఎంపి చేసిన ఆరోపణలపై రవాణాశాఖ మంత్రి అచ్చెన్నాయడు స్పందించిన తీరుపై ఎంపి విరుచుకుపడ్డారు. ప్రలజకు సౌకర్యంగా ఉంటుందనే ప్రభుత్వం స్లీపర్ బస్సులను అనుమతిస్తోందని మంత్రి అన్నారు. దానిపై ఎంపి మాట్లాడుతూ ప్రజలకు సౌకర్యమనుకుంటే వ్యభిచార గృహాలు, పేకాట క్లబ్బులను కూడా అనుమతిస్తుందా ప్రభుత్వం అంటూ నిలదీసారు.
కొంత కాలంగా ఎంపికి ప్రభుత్వంలోని ముఖ్యులకు ఎక్కడో చెడింది. దాంతో అప్పటి నుండి ఎంపి బహిరంగంగానే ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. మొదటి నుండి ట్రాన్స్ పోర్ట్ ఆపరేటరన్న విషయం అందరకీ తెలిసిందే కదా? ప్రైవేటు ఆరపరేటర్ల మధ్య ఉన్న పోటీని కేశినేని నాని తట్టుకోలేకపోయారు. రవాణాశాఖ ఉన్నతాధాకారులు కూడా నానికి సహకారం అందించలేదు.
అధికార పార్టీ ఎంపిగా ఉండి కూడా ఉన్నతాధికారుల సహకారాన్ని పొందలేకపోవటాన్ని నాని అవమానంగా భావించారు. అందుకు నిరసనగానే తన ట్రాన్స్ పోర్టు సంస్ధను ఇటీవలే మూసేసారు. అప్పటి నుండి ఉన్నతాధికారులపై బహిరంగంగానే విరుచుకుపడుతున్నారు. దశాబ్దాల పాటు కేశినేనా ట్రావెల్స్ నడిపిన అనుభవం ఉంది కాబట్టి సహజంగానే రవాణాశాఖలోని లొసుగులన్నీ నానికి బాగా తెలుసు. దాంతో రోజుకో నిబంధన పేరు చెప్పి ఉన్నతాధికారులపై విరుచుకుపడుతున్నారు.
తాజాగా స్లీపర్ బస్సులను అనుమతించటం కూడా అందులో భాగమే. ఎంపి వాదన చూస్తుంటే స్లీపర్ బస్సులు నడపటంట నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లుంది. మరైతే తాను మాత్రం స్లీపర్ బస్సులను ఇంతకాలం ఎలా నడిపారో? ప్రభుత్వం తన ఇష్టం వచ్చినట్లు బస్పులను నడిపేందుకు లేదని ప్రతీదానికీ నియమ, నిబంధనలుంటాయంటూ నాని చెప్పటం గమనార్హం. స్లీపర్ బస్సులు నడపటానికి చట్టంలో అనుమతి లేదన్నారు. రవాణాశాఖలో జరుగుతున్న అవినీతిని కమీషనర్ బాలసుబ్రమణ్యం అరికట్టలేకపోయినట్లు ఎంపి చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా చర్చ మొదలైంది.