చివరిసారిగా నిన్ను చూడాలని ఉంది, భర్తకు వాట్సాప్ కాల్ చేసిన భార్య.. చివరికి...

Published : Sep 26, 2022, 10:10 AM IST
చివరిసారిగా నిన్ను చూడాలని ఉంది, భర్తకు వాట్సాప్ కాల్ చేసిన భార్య.. చివరికి...

సారాంశం

నిన్ను చివరిసారిగా చూడాలని ఉంది అంటూ భర్తకు వాట్సాప్ కాల్ చేసిన ఆ భార్య ఆత్మహత్య చేసుకుంది. భార్య ఫోన్ తో కంగారుపడి పరుగుపరుగున భర్త ఇంటికి చేరుకునే సరికే ఘోరం జరిగిపోయింది. 

విశాఖపట్నం : మండలంలోని భీమిలి క్రాస్ రోడ్డు వద్ద గల ఓ అపార్ట్మెంట్లో వివాహిత ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానిక సీఐ రామచంద్రరావు శనివారం తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి….మండలంలోని గొట్టిపల్లి పంచాయతీ వెంకటాపురం గ్రామానికి చెందిన హైమకు మాకవరపాలెం మండలం అప్పన్నపాలెం గ్రామానికి రెండేళ్ల క్రితం వివాహమైంది. వారు బతుకు తెరువు కోసం వెంకటాపురం వచ్చి భీమిలి క్రాస్ రోడ్డు వద్దగల ఓ అపార్ట్ మెంట్ లో  నివసిస్తున్నారు.

రమణ దివీస్ లో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో వీరికి ఏడాది క్రితం బాబు జన్మించాడు. అప్పట్లో హైమ(22)కు శస్త్రచికిత్స జరగగా విటించడంతో ఆమె చికిత్స పొందుతోంది. అప్పటినుంచి కడుపునొప్పితో బాధపడుతోంది. శనివారం వారి కుమారుడు చేతన్ పుట్టిన రోజు. దీంతో బంధువులను ఆహ్వానించడానికని రమణ శుక్రవారం ఉదయం విజయనగరం వెళ్లాడు. మధ్యాహ్నం సమయంలో భర్త రమణకు హైమ వాట్సాప్ కాల్ చేసింది. 

కడుపునొప్పి తీవ్రంగా ఉందని, భరించలేకపోతున్నానని, ఆఖరిసారిగా నిన్ను చూడాలని వాట్సాప్ కాల్ చేశానని మాట్లాడి ఫోన్ పెట్టేసింది. దీంతో కంగారుపడిన రమణ తిరిగి ఇంటికి చేరుకోగా అప్పటికే హైమ ఉరివేసుకుని మరణించింది. ఈ మేరకు అందిన ఫిర్యాదుతో సీఐ రామచంద్రారావు ఆధ్వర్యంలో ఎస్ఐ నరసింహమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్
Bus Accident : అల్లూరి జిల్లాలో ఘోరం.. బస్సు ప్రమాదంలో 15మంది మృతి