
ప్రొద్దుటూరు మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికంటే టిడిపికి ఎందుకు భయం? సమస్యే లేని చోట శాంతిభద్రతల సమస్య పేరుతో ఏకంగా ఛైర్మన్ ఎన్నికే ఒకరోజు వాయిదే వేయించింటం చూస్తుంటే తమ్ముళ్ళల్లో ఎంతటి అభద్రత ఏర్పడిందో అర్ధమవుతోంది. స్ధానికి సంస్ధల ఎంఎల్సీ ఎన్నికలో గెలిచినట్లే ఇక్కడా గెలుద్దామని తమ్ముళ్ళు పెద్ద ప్లానే వేసినట్లున్నారు. ప్రొద్దుటూరు మున్సిపల్ ఛైర్మన్ గా ఉన్న గురివిరెడ్డి రాజీనామాచేసారు. దాంతో అక్కడ ఎన్నిక అనివార్యమైంది. అధికారులు ఎప్పుడైతే ఛైర్మన్ ఎన్నిక తేదీని ప్రకటించారో అప్పటి నుండే అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దాంతో పాటే ఉద్రిక్తత పరిస్ధితులూ మొదలయ్యాయి. దాంతో ఏకంగా ఎన్నికనే వాయిదే వేసారు రేపటికి.
ఖాళీ అయిన మున్సిపల్ ఛైర్మన్ పోస్టుకు మాజీ ఎంఎల్ఏ వరదరాజులరెడ్డి బంధువు ఆసం రఘురామిరెడ్డి బరిలో నిలిచారు. మరో కౌన్సిలర్ ముక్తియార్ కూడా రంగంలోకి దిగారు. మున్సిపాలిటిలోని 41 వార్డుల్లో వైసీపీకి 19 మంది కౌన్సిలర్లు మద్దతున్నారు. అలాగే మరో రెండు వర్గాలు కూడా ఉన్నాయి. దాంతో ఎన్నిక జరిగితే ఓడిపోతామనే భయంతోనే టిడిపి ఎన్నికను వాయిదా వేయించినట్లు వైసీపీ ఆరోపిస్తోంది. ఎటువంటి కారణం లేకపోయినా ఉదయం నుండి సమావేశమందిరంలో టిడిపి కౌన్సిలర్లు ఒకటే రచ్చ రచ్చ చేస్తున్నారు. ఫర్నీచర్ ను ధ్వసం చేసారు. అధికారులతో గొడవకు దిగారు. ఇదంతా చూస్తుంటే ఎన్నికలంటే టిడిపి భయపడుతున్నట్లే ఉంది.
టిడిపి అభ్యర్ధినే ఛైర్మన్ గా ఎన్నుకోవాలంటూ కౌన్సిలర్లకు మంత్రి ఆదినారాయణరెడ్డి రాసిన లేఖలు కూడా వివాదాన్ని రాజేసింది. నిజానికి ఎన్నిక జరిగితే టిడిపికి గెలిచే అవకాశం లేదు. అందుకనే ఉదయం నుండి గొడవ ప్రారంభించారు. గొడవను అధికారులు పట్టించుకోకపోవటంతో కౌన్సిలర్లు మినిట్స్ బుక్ ను చింపేసారు. దాంతో గొడవ తీవ్రస్ధాయికి చేరుకున్నది. దాంతో అధికారులు భయపడి ఎన్నికను రేపటికి వాయిదా వేసారు. అయినా పలువురు కౌన్సిలర్లు మాత్రం సమావేశమంవదిరంలోనే ఉండిపోయారు. బయటకు వెళితే తమకు ప్రాణభయం ఉందంటూ సమావేశ మందిరంలోనే కూర్చోవటం గమనార్హం.