మంత్రి శపథం నెరవేరుతుందా?

First Published Apr 15, 2017, 7:47 AM IST
Highlights

ఎప్పుడు ఎన్నికలు జరిగినా పోయిన ఎన్నికల్లో వచ్చిన సీట్లే మళ్ళీ పునరావృతమవుతాయంటూ టిడిపి నేతలే చెబుతున్నారు. ప్రభుత్వంపైనున్న వ్యతిరేకత ఎక్కువైతే టిడిపి పరిస్ధితి మరింత ఘోరంగా ఉంటుందనటంలో ఎవరికీ సందేహాలు లేవు. వాస్తవం ఇలావుండగా మంత్రేమో వైసీపీపై తొడగొడుతుండటం విచిత్రంగా ఉంది.

చిత్తూరు జిల్లాలో వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఒక్క సీటు కూడా రాకుండా చేస్తానంటూ మంత్రి అమరనాధ రెడ్డి సవాలు విసిరారు. వైసీపీ నుండి పలమనేరు నియోజకవర్గంలో గెలిచిన అమర్ టిడిపిలోకి ఫిరాయించిన సంగతి తెలిసిందే కదా? అందులోనూ ఇటీవలే మంత్రి కూడా అయ్యారు. దాంతో అయ్యగారి మాటలకు పట్టపగ్గాలు లేకుండా పోయాయి. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఒక్క సీటు కూడా రానీయనంటూ శపథం చేసారు. మొత్తం సీట్లన్నీ టిడిపి క్లీన్ స్వీప్ చేస్తుందట. అందుకు తాను బాధ్యత తీసుకుంటానని కూడా మంత్రి శెలవిచ్చారండోయ్.

భవిష్యత్తులో జిల్లాలోని వైసీపీ నేతలకు నిద్రలేని రాత్రులను రుచి చుపిస్తానంటూ తొడగొట్టటం విచిత్రంగా ఉంది. మొన్నటి ఎన్నికల్లో జిల్లాలోని మొత్తం 14 సీట్లలో వైసీపీ 8 నియోజకవర్గాల్లో గెలవగా, టిడిపి 6 సీట్లతో సరిపెట్టుకున్నది. అయితే, తర్వాత ఇద్దరు వైసీపీ ఎంఎల్ఏలను చంద్రబాబు లాక్కున్నారు. అప్పటికి ఇప్పటికీ రెండు పార్టీల పరిస్ధితుల్లో అయితే పెద్దగా మార్పు అయితే లేదు.

ఎప్పుడు ఎన్నికలు జరిగినా పోయిన ఎన్నికల్లో వచ్చిన సీట్లే మళ్ళీ పునరావృతమవుతాయంటూ టిడిపి నేతలే చెబుతున్నారు. ప్రభుత్వంపైనున్న వ్యతిరేకత ఎక్కువైతే టిడిపి పరిస్ధితి మరింత ఘోరంగా ఉంటుందనటంలో ఎవరికీ సందేహాలు లేవు. వాస్తవం ఇలావుండగా మంత్రేమో వైసీపీపై తొడగొడుతుండటం విచిత్రంగా ఉంది.

టిడిపి పరిస్ధితి అంత పటిష్టంగా ఉంటే మరి పోయిన ఎన్నికల్లో అమర్ వైసీపీలో ఎందుకు చేరినట్లు? రాజకీయంగా ఎన్నో పదవులిచ్చిన టిడిపిని కాదని వైసీపీలో చేరింది టిడిపికి భవిష్యత్తు లేదనే కదా? ఏవో తాయిలాలు అందేటప్పటికి టిడిపిలోకి ఫిరాయించగానే మళ్ళీ వైసీపీపైన దుమ్మెత్తిపోయటమేమిటో?

click me!