రఘురామ కృష్ణమ రాజు అరికాళ్లు కమిలినట్లు ఎందుకున్నాయంటే...

By telugu teamFirst Published May 17, 2021, 8:51 AM IST
Highlights

సిఐడి కస్టడీలో మాస్కులు ధరించి వచ్చిన ఐదుగురు వ్యక్తులు తనను కొట్టారని వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణమ రాజు ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే, కొట్టిన దెబ్బలు కావని వైద్యుల బృందం తేల్చింది.

అమరావతి: సిఐడి కస్టడీలో తనను ముసుగులు ధరించిన ఐదుగురు వ్యక్తులు తనను కొట్టారని వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణమ రాజు ఆరోపించిన విషయం తెలిసిందే. తన కాళ్లను కట్టేసి, అరికాళ్లపై కర్రలతోనూ రబ్బరు తాడుతోనూ కొట్టారని ఆయన చెప్పారు. కమిలినట్లు ఉన్న తన అరిపాదాలను మీడియాకు కూడా చూపించారు. అరెస్టయిన తర్వాత ఓ రోజు రాత్రి ఆయన సిఐడి కస్టడీలో ఉన్నారు. ఆ సమయంలో తనను కొట్టారని రఘురామ కృష్ణమ రాజు కోర్టుకు ఫిర్యాదు చేశారు. 

దాంతో కోర్టు జీజీహెచ్ ఆస్పత్రికి చెందిన ముగ్గురు వైద్యులతో కమిటీ వేసి, నివేదిక అందించాల్సిందిగా ఆదేశించింది. దాంతో గుంటూరుకు చెందిన జీజీహెచ్ వైద్యుల బృందం కోర్టుకు నివేదికను సమర్పించింది. రఘురామకృష్ణమ రాజును ఎవరూ కొట్టిన దాఖలాలు లేవని వైద్యుల బృందం తేల్చింది. అయితే, ఆయన అరిపాదాలు ఎర్రగా కమిలినట్లు ఎలా ఉన్నాయనే ప్రశ్న ఉదయిస్తోంది. 

Also Read: రమేష్ ఆస్పత్రికి రఘురామ తరలింపులో ట్విస్ట్: సిఐడి రివ్యూ పిటిషన్

ఎడెమా (వాపు) వల్ల ఆయన కాళ్లు అలా అయ్యాయని వైద్యుల బృందం తేల్చింది. వైద్య నిపుణుల నివేదికను న్యాయమూర్తులు కోర్టులో చదివి వినిపించారు సూక్ష్మనాళాలు దెబ్బ తిని నీరు కాళ్లలోకి చేరితే సహజంగా ఈ ఎడెమా వస్తుంటుందని, కాళ్లు స్వల్పంగా వాచి నీరు చేరి ఉబ్బినట్లు కనిపిస్తాయని అంటున్నారు. ఎక్కువ సేపు నించున్నా, అదే పనిగా కూర్చున్నా అలా జరుగుతుంంటుందని వైద్య నిపుణుల నివేదిక తేల్చింది. 

రఘురామ కృష్ణమ రాజు షుగర్ వ్యాధిగ్రస్తుడు కాబట్ిట ఇది సహజమేనని వైద్యులు అన్నారు. దాంతో రఘురామకృష్ణమ రాజు చేసిన ఫిర్యాదులో వాస్తవం లేదని తేలింది. అయితే, రమేష్ ఆస్పత్రిలో రఘురామకృష్ణమ రాజుకు వైద్య పరీక్షలు చేయించాలనే కోర్టు ఆదేశాలను సిఐడి బేఖాతరు చేసింది. 

Also Read: రఘురామను ఎవరూ కొట్టలేదు: వైద్యుల నివేదికలో సంచలన విషయాలు

కాగా, హైకోర్టులో తన బెయిల్ పిటిషన్ డిస్మిస్ అయ్యేంత వరకు కూడా కస్టడీలో తనను కొట్టారని రఘురామకృష్ణమ రాజు ఆరోపించలేదు. తన బెయిల్ పిటిషన్ లో కూడా ఆయన దాన్ని ప్రస్తావించలేదు. ఒక వేళ కొట్టి ఉంటే బెయిల్ పిటిషన్ లోనే దాన్ని ప్రస్తావించి ఉండేవారని చెబుతున్నారు. మీడియాతో మాట్లాడిన రఘురామ కృష్ణమ రాజు కుమారుడు భరత్ కూడా ఆ విషయం చెప్పలేదు. 

రఘురామకృష్ణమ రాజును సిఐడి కస్టడీలో కొట్టారని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడితో పాటు ఇతర టీడీపీ నేతలు ఆరోపించారు. బిజెపి నాయకులు కూడా రఘురామకృష్ణమ రాజును కొట్టారని ఆరోపించారు. ఓ ఎంపీకే ఇటువంటి పరిస్థితి ఎదురైతే సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.

click me!