వర్షాకాలంలో కరువు యాత్రలా ?

First Published Sep 7, 2017, 2:35 PM IST
Highlights
  • ఎవరైనా కరువు యాత్రలు చేయాలంటే ఎప్పుడు చేస్తారు? మంచి ఎండాకాలంలో చేస్తారు. లేకపోతే యాత్రలకు అర్ధముండదు.
  • కానీ భారతీయ జనతా పార్టీ నేత, కేంద్ర మాజీమంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి మాత్రం కరువుపై అధ్యయనం పేరుతో యాత్ర చేస్తున్నారు.
  •  గురువారం అనంతపురం జిల్లాలో  పర్యటిస్తున్నారు.
  •  ఈ సమయంలలో తామె పర్యటన విచత్రంగానే ఉంది. విచిత్రమెందుకంటే, రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి.

ఎవరైనా కరువు యాత్రలు చేయాలంటే ఎప్పుడు చేస్తారు? మంచి ఎండాకాలంలో చేస్తారు. లేకపోతే యాత్రలకు అర్ధముండదు. కానీ భారతీయ జనతా పార్టీ నేత, కేంద్ర మాజీమంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి మాత్రం కరువుపై అధ్యయనం పేరుతో యాత్ర చేస్తున్నారు.  గురువారం అనంతపురం జిల్లాలో  పర్యటిస్తున్నారు.  ఈ సమయంలలో తామె పర్యటన విచత్రంగానే ఉంది. విచిత్రమెందుకంటే, రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. వర్షాలు పడుతున్న ఈ సమయంలో కరువుయాత్రలు చేస్తే జనాలు నవ్వుతారు. కేంద్రమంత్రిగా చేసిన పురంధేశ్వరికి ఇంతచిన్న విషయం తెలీకుండానే ఉంటుందా?

అయినా, రాయలసీమలో తిరుగుతున్నారంటే అర్ధమేంటి? పైగా తన యాత్ర పూర్తిగా వ్యతిరేకమని, రాజకీయాలతో ముడిపెట్టవద్దని చెబుతున్నారు. రెండేళ్ళ క్రితం కుడా కరువుపై అధ్యయనం పేరుతో రాయలసీమలో తిరిగారు. మరి అప్పుడు తిరిగి ఏం చేసారో ఏమో. కేంద్రానికి నివేదిక ఇస్తానని అప్పట్లో చెప్పారు. ఇచ్చిందీ లేనిదీ తెలీదు. మళ్ళీ ఇపుడు కుడా కేంద్రానికి నివేదిక ఇస్తాననే చెబుతున్నారు. సరే, ప్రాజెక్టులు, నీటి లభ్యత, జలాల మళ్ళింపు లాంటి అనేక అంశాల గురించి చాలా విషయాలే మాట్లాడుతున్నారు లేండి.

నిజంగానే కరువుపై నివేదిక సిద్ధం చేయాలంటే ఏ జిల్లా సమాచారం కావాలన్నా అందించేందుకు పార్టీ యంత్రాంగం ఉంది. అందులోనూ రెండేళ్ళ క్రితమే పర్యటించారు కుడా. అప్పటికి ఇప్పటికీ పరిస్ధితుల్లో పెద్దగా మార్పులేమీ ఉండవు. మళ్ళీ కొత్తగా పర్యటనలు చేస్తున్నారంటేనే అందులోనూ వర్షాకాలంలో కరువుపై అధ్యయనం చేస్తున్నట్లు చెబుతున్నారంటేనే ఏదో తేడాగా ఉంది.

click me!