పికె ఎక్కడ? మాట్లాడ్డేం?

First Published Feb 2, 2018, 8:06 AM IST
Highlights
  • ఉభయ తెలుగు రాష్ట్రాలకు బడ్జెట్లో కేంద్రం అన్యాయం చేసిన సంగతి అందరకీ తెలిసిందే.

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఎక్కడున్నాడో? అర్ధంకాని వీరావేశంతో సంబంధం లేని డైలాగులతో జనాలను కన్ఫ్యూజ్ చేసే పవన్ బడ్జెట్ పై ఏమీ మాట్లాడటం లేదే? ఉభయ తెలుగు రాష్ట్రాలకు బడ్జెట్లో కేంద్రం అన్యాయం చేసిన సంగతి అందరకీ తెలిసిందే. పార్టీలన్నీ కేంద్రంపై మండిపోతున్నాయ్. సరే అధికారపార్టీలు కూడా ఏదో ఒకరకంగా తమ ఆగ్రహాన్ని తెలియజేస్తున్నాయి.

ఇటువంటి నేపధ్యంలో ప్రశ్నించటానికే పుట్టందంటూ జనసేన గురించి చెప్పుకునే పవన్ మాత్రం ఎక్కడా అడ్రస్ లేకపోవటమే ఆశ్చర్యం. చాలా కాలంగా ఏదో ఓ కారణంతో కేంద్రంపై పవన్ విమర్శలు చేస్తూనే ఉన్నారు. రేపటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో పొత్తులుంటాయో లేదో తెలీదు. కానీ ఇపుడు ఏపికి అన్యాయం జరిగిందన్నది మాత్రం వాస్తవం.

మరి ఆ అవకాశాన్ని పవన్ ఎందుకు ఉపయోగించుకోవటం లేదు? ప్రత్యేకహోదా లేదు. ప్రత్యేక ప్యాకేజీ కూడా లేదు. రాజధాని, పోలవరంకు నిధుల సంగతి గోవిందా. రాష్ట్రప్రయోజనాలు, విభజన చట్టం అమలు లాంటవన్నీ గాలికికొట్టుకు పోయాయి.

గురువారం బడ్జెట్ ప్రవేశపెట్టిన దగ్గర నుండి టిడిపి, వైసిపితో పాటు ప్రతిపక్షాలన్నీ మండిపోతున్నాయి. వైసిపి అయితే రాష్ట్రంలోని పలుచోట్ల ప్రత్యక్ష ఆందోళనకు దిగాయి. టిడిపి మంత్రులు, ఎంపిలు, నేతలు కూడా చంద్రబాబునాయుడుపై పొత్తులు వద్దంటూ ఒత్తిడి తెస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటువంటి పరిస్ధితుల్లో స్పందించన ఏకైక వ్యక్తి పవన్ మాత్రమే. ఎన్నికల ముందు ప్రవేశపెట్టిన చివరి బడ్జెట్లో కేంద్రం ఏపికి ఇంత అన్యాయం చేసిన తర్వాత కూడా పవన్ మాట్లాడకపోతే వచ్చే ఎన్నికల్లో జనసేనను జనాలు నమ్మరు.

click me!