కేంద్రంపై మండిపోతున్న టిడిపి

First Published Feb 1, 2018, 4:49 PM IST
Highlights
  • టివిల్లో చర్చలకు కూర్చున్నవాళ్ళుకానీ, నిపుణులు కానీ బడ్జెట్ పై మండిపోతున్నారు.

కేంద్రం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్ పై టిడిపి మండిపోతోంది. బడ్జెట్లో ఏపికి సంబంధించిన కీలకమైన ఒక్క అంశాన్ని కూడా కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ప్రస్తావించలేదు. దాదాపు గంటన్నరపాటు ప్రసంగించిన జైట్లీ ఏపిలోని పెండింగ్ ప్రాజెక్టులపైన కానీ విభజన హామీలపైన కానీ ఒక్కటంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దాంతో రాష్ట్రంలోని జనాలు బిజేపిపై దుమ్మెత్తిపోస్తున్నారు. టివిల్లో చర్చలకు కూర్చున్నవాళ్ళుకానీ, నిపుణులు కానీ బడ్జెట్ పై మండిపోతున్నారు.

క్షేత్రస్ధాయిలో పరిస్ధతిని గమనించిన టిడిపి వెంటనే మేల్కొంది. ముందుగా టిడిపి రాజ్యసభ సభ్యుడు, కేంద్రమంత్రి సుజనా  చౌదరి మీడియాతో మాట్లాడుతూ, బడ్జెట్ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బడ్జెట్ తమను తీవ్రంగా నిరాసపరిచిందని చెప్పటం గమనార్హం. కీలకమైన ఏ ప్రాజెక్టు విషయంలో కూడా కేంద్రం స్పందించలేదన్నారు. రాజధాని, పోలవరం, ప్రత్యేక రైల్వేజోన్ లాంటి అంశాలపై జైట్లీ ప్రస్తావించాల్సిందిగా సుజనా చెప్పారు. వచ్చే ఆదివారం ఇదే విషయమై చంద్రబాబుతో తాము భేటీ అవుతున్నట్లు కూడా చెప్పారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే సుజనా మాటంటే సాక్ష్యాత్తు చంద్రబాబునాయుడు మాటే. కేంద్రంలో తన మాట వినిపించేందుకే చంద్రబాబు రాజ్యసభ సభ్యుడు సుజనాను పెట్టుకున్నారు. తాజాగా సుజనా మాటలను బట్టి చంద్రబాబులో కూడా ఎంత అసంతృప్తి ఉందో బయటపడుతోంది. అయితే, ఈరోజు రాత్రిలోగా చంద్రబాబు కూడా బడ్జెట్ పై స్పందించే అవకాశం ఉంది. అయితే, కేంద్ర బడ్జెట్ పై టిడిపి నేతలు ఒక్కొక్కరుగా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. వర్ల రామయ్య కూడా కేంద్రంపై మండిపడుతున్నారు.

 

 

click me!