వెంకయ్య నామినేషన్ కు చంద్రబాబు డుమ్మా ?

First Published Jul 18, 2017, 9:23 AM IST
Highlights
  • నామినేషన్ కార్యక్రమానికి చంద్రబాబు ఢిల్లీ వెళుతున్నట్లు సిఎం కార్యాలయం కూడా ధృవీకరించింది.
  • గంటన్నర వ్యవధిలోనే పొలిటికల్ డెవలప్మెట్ ఏం జరిగిందో ఎవరికీ అర్ధం కావటం లేదు.
  • అసలు వెంకయ్య నామినేషన్ కార్యక్రమానికి చంద్రబాబు హాజరవ్వటం లేదన్న విషయాన్నే పార్టీలో నేతలెవ్వరూ నమ్మలేకున్నారు.
  • మరి ఏం జరిగిందో ఏమో?

చంద్రబాబునాయుడు-వెంకయ్యనాయుడుల మద్య అనుబంధం అందరికీ తెలిసిందే. అటువంటి వెంకయ్య ఎన్డీఏ తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా ఈరోజు ఉదయం నామినేషన్ వేస్తున్నారు. అంతటి ముఖ్య ఘట్టానికి చంద్రబాబు మాత్రం వెళ్ళటం లేదు. కారణమేంటి? ఎవరికీ తెలియటం లేదు. ఎవరికి వారు కారణాలను ఆరాతీయటంలో బిజీగా ఉన్నారు. ఎందుకంటే, మంగళవారం సాయంత్రం మంత్రివర్గ సమావేశం జరగాలి. అంతకన్నా ముందే సమన్వయ కమిటీ సమావేశం జరగాలి.

ఎప్పుడైతే మంగళవారం ఉదయం వెంకయ్య నామినేషన్ వేస్తున్నారని ప్రకటించారో అప్పటికప్పుడు చంద్రబాబు మంత్రివర్గ సమావేశంతో పాటు సమన్వయ కమిటి సమావేశాన్ని కూడా రద్దు చేసుకున్నారు. సోమవారం రాత్రి జరిగిన మీడియా సమావేశంలో కూడా వెంకయ్యను చంద్రబాబు ఆకాశానికి ఎత్తేసారు. నామినేషన్ కార్యక్రమానికి చంద్రబాబు ఢిల్లీ వెళుతున్నట్లు సిఎం కార్యాలయం కూడా ధృవీకరించింది. అందుకనే మంగళవారం నాటి కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకున్నట్లు కూడా చెప్పారు.

అటువంటిది ఏం జరిగిందో ఏమో ఎవరికీ తెలీదు. మీడియా సమావేశం ముగించుకుని క్యాంపు కార్యాలయంకు చంద్రబాబు వెళ్లిపోయారు. అయితే హటాత్తుగా మంగళవారం నాటి సిఎం కార్యక్రమాలన్నీ యధావిధిగానే సాగుతాయని, చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళటం లేదని అందరికీ సమాచారం అందింది. దాంతో అందరూ ఆశ్చర్యపోయారు.  గంటన్నర వ్యవధిలోనే పొలిటికల్ డెవలప్మెట్ ఏం జరిగిందో ఎవరికీ అర్ధం కావటం లేదు. అసలు వెంకయ్య నామినేషన్ కార్యక్రమానికి చంద్రబాబు హాజరవ్వటం లేదన్న విషయాన్నే పార్టీలో నేతలెవ్వరూ నమ్మలేకున్నారు. మరి ఏం జరిగిందో ఏమో?

click me!