ప్రతిరోజూ వైసీపీ భజన ఎందుకు ?

Published : Dec 31, 2016, 10:21 AM ISTUpdated : Mar 25, 2018, 11:45 PM IST
ప్రతిరోజూ వైసీపీ భజన ఎందుకు ?

సారాంశం

చంద్రబాబు చెప్పినట్లుగా నిజంగానే వైసీపీ బలహీన పడుతుంటే మరి ప్రతీ రోజూ వైసీపీ గురించే ఎందుకు మాట్లాడతుతున్నట్లు?

అదేంటో చంద్రబాబునాయడుకి వైసీపీ భజన ఎక్కువైపోతోంది. రాజకీయంగా కావచ్చు, అభివృద్ధిపరంగా కావచ్చు విషయం ఏదైనా కానీండి దాన్ని వైసీపీకి ముడిపెట్టి జగన్ను తూర్పార పట్టకపోతే చంద్రబాబుకు తోచటం లేదేమో. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో చంద్రబాబు ప్రతీరోజూ వైసీపీని తలచుకుంటూనే ఉన్నారు.

 

తాజాగా కృష్ణాజిల్లాకు చెందిన పలువురు రైతులు చంద్రాబాబును కలిసారు. పోలవరం కాంక్రీట్ పనులకు శంకుస్ధాపన చేసినందుకు అభినందించారు. అంత వరకూ బాగానే ఉన్నది. తనను కలసిన రైతులతో చంద్రబాబు మాట్లాడుతూ, దేవతలు యాగాలు చేస్తుంటే రాక్షసులు చెడగొట్టే ప్రయత్నాలు చేస్తుంటారని వైసీపీపై విరుచుకుపడ్డారు.

 

సరే అదైపోయింది. ఆ తర్వాత పార్టీ నేతలతో మాట్లాడుతూ, రాష్ట్రంలో రోజు రోజుకు వైసీపీ బలహీన పడుతోందని వ్యాఖ్యానించారు. అదే సందర్భంగా కాంగ్రెస్ మెల్లిగా పుంజుకుంటోందని కూడా చెప్పారు. గతంతో పోలిస్తే కాంగ్రెస్ ఒకట్రెండు శాతం బలపడినట్లుగా కనిపిస్తోందన్నారు.

 

ఇక్కడే అందరికీ ఓ సందేహం వస్తోంది.  చంద్రబాబు చెప్పినట్లుగా నిజంగానే వైసీపీ బలహీన పడుతుంటే మరి ప్రతీ రోజూ వైసీపీ గురించే ఎందుకు మాట్లాడతుతున్నట్లు? ఎవరైనా బలంగా ఉన్న ప్రత్యర్ధి గురించే మాట్లాడుతారు గానీ బలహీనుల గురించి కాదు కదా?

 

చంద్రబాబు మాటల ప్రకారం మరి వైసీపీ బలహీనంగా ఉందా లేక బలపడుతోందా అన్నది అర్ధం కావటం లేదు. చంద్రబాబు విషయం సరే.. మీరేమంటారు?

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : కేవలం నాల్రోజులే సంక్రాంతి హాలిడేస్.. కానీ 11 సెలవులు ఎక్స్ట్రా
IMD Rain Alert : హిందూ మహాసముద్రంలో మరో తుపాను .. అక్కడ కుండపోత వర్షాలు.. తెలుగు రాష్ట్రాల సంగతేంటి..?