జగన్ ఎందుకు హాజరు కావడం లేదు... అక్రమాస్తుల కేసులో సీబీఐ కోర్టు ప్రశ్న...

Published : Dec 22, 2021, 08:17 AM IST
జగన్ ఎందుకు హాజరు కావడం లేదు... అక్రమాస్తుల కేసులో సీబీఐ కోర్టు ప్రశ్న...

సారాంశం

ప్రతిసారీ ఏదో ఒక కారణం చెబుతూ హాజరు కావడం లేదని, బెయిల్ షరతుల ప్రకారం ప్రతి విచారణకు హాజరు కావాలి కదా అని ప్రశ్నించారు. దీనిపై జగన్ తరఫు న్యాయవాది జి అశోక్ రెడ్డి సమాధానమిస్తూ.. బెయిలు మంజూరు చేసినప్పటి పరిస్థితులకు, ఇప్పటి పరిస్థితులకు తేడా ఉందని చెప్పారు. అప్పుడు కేవలం ఎమ్మెల్యే, ఎంపీ గా ఉండేవారని ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు అన్నారు. 

హైదరాబాద్ :  illegal assets case వ్యవహారంలో ప్రధాన నిందితుడైన AP Chief Minister YS Jagan విచారణ నిమిత్తం హాజరు కాకపోవడానని మంగళవారం CBI court ప్రశ్నించింది. 
Hetero, Aurobindoలకు భూకేటాయింపులకు సంబంధించిన కేసుపై మంగళవారం సీబీఐ ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్.మధుసూదన్రావు విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఈ కేసులో ప్రధాన నిందితుడైన జగన్మోహన్ రెడ్డి హాజరు మినహాయింపు కోరుతూ న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. 

దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ.. ప్రతిసారీ ఏదో ఒక కారణం చెబుతూ హాజరు కావడం లేదని, బెయిల్ షరతుల ప్రకారం ప్రతి విచారణకు హాజరు కావాలి కదా అని ప్రశ్నించారు. దీనిపై జగన్ తరఫు న్యాయవాది జి అశోక్ రెడ్డి సమాధానమిస్తూ.. బెయిలు మంజూరు చేసినప్పటి పరిస్థితులకు, ఇప్పటి పరిస్థితులకు తేడా ఉందని చెప్పారు. అప్పుడు కేవలం ఎమ్మెల్యే, ఎంపీ గా ఉండేవారని ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు అన్నారు. అంతేకాకుండా గతంలో నెల లేదంటే వారానికి ఒక రోజు మాత్రమే విచారణ ఉండేదని.. ప్రస్తుతం వారానికి ఐదు రోజుల పాటు విచారణ జరుగుతోందని అన్నారు.

హాజరు తప్పనిసరని ఆదేశిస్తే హాజరవుతారన్నారు. దీంతోపాటు హాజరు మినహాయింపునకు నిరాకరిస్తూ ఈ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించామన్నారు. దీనిపై వాదనలు విన్న హైకోర్టు తీర్పును వాయిదా వేసింది అన్నారు. హాజరు మినహాయింపుపై అక్కడ స్టే కోరగా.. ఇక్కడ పెండింగ్ విషయాన్ని సీబీఐ కోర్టులో చెప్పాలని అంది అన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి ఇదే విషయాన్ని మెమో దాఖలు చేయాలని ఆదేశించడంతో జగన్ తరఫు న్యాయవాది మెమో దాఖలు చేశారు.

హైకోర్టులో పెండింగ్ కేసు వివరాలను మెమోలో పేర్కొన్నారు. ఈ కేసులో జగన్ తో పాటు విజయసాయి రెడ్డి,  జగతి పబ్లికేషన్స్, జగన్ ఇన్ ఫ్రా లు దాఖలు చేసిన డిశ్చార్జి పిటిషన్ లలో కౌంటర్ దాఖలు చేయడానికి సిబిఐ గడువు కోరడంతో.. సిబిఐ కోర్టు విచారణను జనవరి 4కు వాయిదా వేసింది. 

వ్యక్తిగత మినహాయింపు.. జగన్ గేమ్ ప్లాన్.. కేసుల్ని ఆలస్యం చేయడానికే.. సీబీఐ

కాగా, డిసెంబర్ 13న ఆంధ్రప్ర‌దేశ్ సీఎం జగ‌న్ కు  తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అక్రమాస్తుల కేసులో సీఎం జగన్‌ బెయిల్‌ను రద్దు చేయాలంటూ వైసీపీ రెబల్‌ ఎంపీ రఘురామకృష్ణ రాజు వేసిన పిటిషన్‌పై సోమవారం తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా జగన్‌కు నోటీసులు జారీ చేసింది. 

జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి బెయిల్ రద్దు చేయాల‌ని, ఆయ‌న‌పై ఉన్న‌ 11 ఛార్జిషీట్లను  విచారించాలంటూ పిటిష‌న్ లో పేర్కొన్నారు వైసీపీ రెబ‌ల్ ఎంపీ. జగన్ బయట ఉంటే.. తన పదవిని అడ్డుపెట్టుకుని సాక్షులను ప్ర‌త్యేక్షంగానో, ప‌రోక్షంగానో ప్రభావితం చేసే అవకాశం ఉందని పిటిషనర్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అలాగే, ఈ కేసులో వెంట‌నే విచారణ చేయాలని చేయాల‌ని కోరారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రజాప్రతినిధులపై కేసులను త్వరితగతిన ముగించాలని,  జగన్ బెయిల్ రద్దు చేసి అన్ని ఛార్జిషీట్లపై విచారణ జరిపించాలని కోరారు. ఈ నేపథ్యంలో జగన్‌కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది.

PREV
click me!

Recommended Stories

AP Food Commission Warning at NTR District | “మీ ఉద్యోగం పోతుంది చూసుకోండి” | Asianet News Telugu
IMD Rain Alert : శ్రీలంక సమీపంలో ఆవర్తనం... ఈ ప్రాంతాల్లో కుండపోత వర్షాలు