విజయవాడకు ఎందుకు మకాం మార్చలేదు?

Published : Feb 14, 2017, 01:21 AM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
విజయవాడకు ఎందుకు మకాం మార్చలేదు?

సారాంశం

బహుశా మూడు రోజుల క్రితం విజయవాడ విమానాశ్రయంలో రోజు ఉదంతాన్ని జగన్ ముందుగానే ఊహించారేమో.

వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు విజయవాడలో ఉండటం లేదు? ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజయవాడలోనే ఉంటున్నపుడు ప్రతిపక్ష నేత జగన్ మాత్రం ఇంకా హైదరాబాద్ లోనే ఏం చేస్తున్నారు? కేవలం అతిధిగా మాత్రమే ఏపికి వచ్చి వెళుతున్నారంటూ టిడిపి నేతలు చేస్తున్న విమర్శలకు జగన్ సమాధానం ఇవ్వలేదు. బహుశా మూడు రోజుల క్రితం విజయవాడ విమానాశ్రయంలో రోజు ఉదంతాన్ని జగన్ ముందుగానే ఊహించారేమో.

 

విజయవాడలో తనకు రక్షణ లేదని జగన్ అనుమానించటం వల్లే ఇప్పటికీ హైదరాబాద్ కేంద్రంగానే ఏపి రాజకీయాలు చేస్తున్నారన్న సందేహాలను వైసీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. మహిళా సదస్సుకు రావాల్సిందిగా రోజాను ఆహ్వానించిన ప్రభుత్వమే విమానాశ్రయంలో ఆమెను అరెస్టు చేయించింది.  ఎందుకు అరెస్టు చేసారో చెప్పలేదు. అరెస్టు చేసి ఎక్కడికి తరలిస్తున్నారో చెప్పలేదు. గన్నవరం నుండి ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోని వివిధ ప్రాంతాలకు తిప్పుతూ చివరకు హైదరాబాద్ లో దిగబెట్టారు. జరిగిన ఘటనపై ముఖ్యమంత్రి, స్పీకర్ ఇంత వరకూ స్పందిచ లేదు.

 

కారణాలు కూడా చెప్పకుండా రోజాను పోలీసులు విజయవాడలో కాబట్టి అరెస్టు చేయగలిగారు. అదే హైదరాబాద్ లో సాధ్యమయ్యేది కాదు. ఏపిలో టిడిపి నేతలు ఏమి చెప్పినా పోలీసులు గుడ్డెద్దులాగ తలూపినట్లు హైదరాబాద్ లో ఊపరు. ఎందుకంటే, ఇక్కడ ఉన్నది తెలంగాణా ప్రభుత్వం. కాబట్టి పోలీసులు తెలంగాణా ప్రభుత్వ ఆదేశాల మేరకే నడుచుకుంటారు. ఈ విషయాలను బేరీజు వేసుకున్న తర్వాతే తన మకాంను ఇంతవరకూ జగన్ విజయవాడకు మార్చలేదేమో. ఏపిలోని వివిధ ప్రాంతాల్లో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూనే రాత్రికి మళ్లీ జగన్ హైదరాబాద్ కు చేరుకుంటున్నారు. ఉంటే తన వ్యవసాయక్షేత్రం ఇడుపులపాయలోనో లేదంటే హైదరాబాద్లో మాత్రమే జగన్ ఉంటున్నారు. మిగిలిన ప్రాంతాల్లో పర్యటించేటపుడు ఎటుతిరిగీ నేతలు, కార్యకర్తలుంటారు కాబట్టి తన రక్షణకు ఢోకా లేదని అనుకున్నారేమో.

 

 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?