ప్రశ్నించేందుకు జనసేన పుట్టిందన్న పవన్ కల్యాణ్ మౌనమెందుకు ? - సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు

By Asianet News  |  First Published Nov 13, 2023, 2:51 PM IST

సీపీఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు వైసీపీ, బీజేపీ, జనసేనలపై విరుచుకుపడ్డారు. తెలంగాణ ఎన్నికలలో లబ్ది పొందడానికి కృష్ణా జలాల పై ప్రకటనలు చేశారని, అయినా కూడా అటు జనసేన, ఇటు వైసీపీ నాయకులు స్పందించలేదని ఆరోపించారు.


ప్రధాని నరేంద్ర మోడీపై సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు తీవ్ర విమర్శలు చేశారు. ప్రధానిని మాటల మరాఠీ అని అన్నారు. ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఐఏఎస్, ఐపీఎస్ లను కేంద్రంలోని బీజేపీ, ఏపీలో వైసీపీ తమ ప్రచారకర్తలుగా మార్చుకుంటున్నారని విమర్శించారు. మోడీ పాలనలో దేశం విలపిత భారత్ గా మారిందని దుయ్యబట్టారు.

ఘోర రోడ్డు ప్రమాదం.. చెట్టును ఢీకొన్న కారు.. నలుగురు మృతి, ఒకరికి గాయాలు

Latest Videos

ప్రధాని మోడీ ఏపీకి అన్ని విధాలా అన్యాయం చేశారని శ్రీనివాసరావు ఆరోపించారు. తెలంగాణ ఎన్నికలలో లబ్ది పొందడానికి కృష్ణా జలాల పై ప్రకటనలు చేశారని, అయినా వైసీపీ, టీడీపీ, జనసేన నేతలు ఈ విషయంపై మాట్లాడటం లేదని అన్నారు. ప్రశ్నించడానికే జనసేన పుట్టిందన్న పవన్ కల్యాణ్ కూడా ఈ విషయంలో మౌనంగా ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. జనసేన తెలంగాణలో బీజేపీతో పొత్తుపెట్టుకుందని అన్నారు. 

జైషే మహ్మద్ ఉగ్రవాది మౌలానా రహీం ఉల్లా తారిఖ్ హతం.. కరాచీలో కాల్చిచంపిన గుర్తు తెలియని వ్యక్తులు..

26 జిల్లాల్లో తాము యాత్ర చేశామని, కానీ ఎక్కడా కూడా జగన్ కావాలని ఎవరూ చెప్పలేదని శ్రీనివాస్ రావు చెప్పారు. వై నీడ్ ఏపీ అనే పదం తనకే నోరు తిరగడం లేదని, ఇక సామాన్య ప్రజలకు ఎలా అర్థమవుతుందని ఎద్దేవా చేశారు. ఏపీ ప్రజలు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పన్నులు, విద్యుత్ భారాలతో ప్రజలు అల్లాడిపోతున్నారని చెప్పారు. ఏజెన్సీ ప్రాంతాల్లో నాడూ, నేడూ జగనన్న ఇళ్లు లేవని ఆరోపించారు. 

gang-rape : దారుణం.. యువతికి బలవంతంగా మద్యం తాగించి సామూహిక అత్యాచారం..

అదివాసీ ప్రజలను వైఎస్ జగన్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆయన విమర్శించారు. ఏజెన్సీ ప్రాంతాలకు అంబులెన్స్ లు వెళ్లేందుకు రోడ్డు సౌకర్యం కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో గిరిజన మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కనీసం చిన్న చిన్న వంతెనలు కూడా నిర్మించలేదని, దీంతో గిరిజనులు ముప్పై కిలోమీటర్ల తిరిగి వెళ్లాల్సిన దుస్థితి నెలకొందని అన్నారు. నీ వ్యాపారవేత్త అదానీ కోసం మాత్రం హైవేలు వేస్తున్నారని అన్నారు. అందుకే జగన్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు.

యూకే ప్రధాని రిషి సునక్ దంపతులతో జైశంకర్ భేటీ.. విరాట్ కోహ్లీ ఆటోగ్రాఫ్ చేసిన బ్యాట్ బహుమతిగా అందజేత

అందుకే ఈనెల 15న విజయవాడ లో ప్రజా రక్షణ భేరీ నిర్వహిస్తున్నాం అని చెప్పారు. ఇందులో జగన్ ప్రభుత్వం వైఫల్యాలను సభలో వివరిస్తామని అన్నారు. వేలాది మందితో భారీ ర్యాలీ నిర్వహించి, బహిరంగ సభ లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను ప్రశ్నిస్తామని తెలిపారు.ప్రజల ఎజెండాతో సాగుతున్న‌ప్రజా రక్షణ భేరికి లక్షమంది వరకు తరలిరానున్నారని అన్నారు. 
 

click me!