సీఎం జగన్ కు మద్యం, ఇసుక రెండుకళ్లు... : ఆనంద్ బాబు ఎద్దేవా

By Arun Kumar PFirst Published Nov 13, 2023, 2:06 PM IST
Highlights

ఇసుక అక్రమాల ద్వారా దోచుకున్న డబ్బును ఎన్నికల్లో ఖర్చు చేయాలని వైసిపి చూస్తోందని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ఆరోపించారు. 

గుంటూరు : ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మద్యం, ఇసుకను రెండు కళ్లుగా భావిస్తున్నాడని మాజీ మంత్రి, టిడిపి నేత నక్కా ఆనంద్ బాబు ఎద్దేవా చేసారు. మద్యం, ఇసుక అక్రమాల ద్వారా కొల్లగొడుతున్న డబ్బంతా చివరకు చేరేది తాడేపల్లి ప్యాలెస్ కే అని ఆరోపించారు. తన స్వలాభం కోసం ఇసుక అక్రమ రవాణాను సీఎం జగన్ ప్రోత్సహించడంతో సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోయిందని... గతంలో వెయ్యి పన్నెండు వందలకు వచ్చే ట్రాక్టర్ ఇసుక ప్రస్తుతం రూ.6 వేలకు చేరిందన్నారు. కేవలం ప్రభుత్వం మారడంతోనే ఇసుక ధర కూడా మారిందని మాజీ మంత్రి పేర్కొన్నారు. 

రాష్ట్రానికి కాదు వైసిపికి, సీఎం జగన్ కు మద్యం, ఇసుక ప్రధాన ఆదాయ వనరుగా మారిందని మాజీ మంత్రి అన్నారు. ఎన్జిటి (నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్) ఆదేశాలను సైతం లెక్కచేయకుండా అధికార పార్టీ నాయకులు ప్రకృతి వనరులను దోచుకుంటున్నారని అన్నారు. మైనింగ్ డైరెక్టర్ వెంకట్ రెడ్డి అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందని ఆనంద్ బాబు మండిపడ్డారు. 

నిబంధనలకు విరుద్దంగా రాజమండ్రి బీచ్, తాడేపల్లి మండలం గుండెమెడలో ప్రొక్లైనర్లతో ఇసుకను తవ్వి దోచుకుంటున్నారు మాజీ మంత్రి ఆరోపించారు. ఈ నాలుగున్నరేళ్లులో రాష్ట్రంలోని సహజ సంపదనంతా అందినకాడిని దోచేసారని అన్నారు. హైవేల పక్కనే ఇసుకను డంప్ చేసి మరీ అమ్ముకుంటున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చిన అన్నారు. అధికార పార్టీ నాయకులే ఇలా ఇసుక దందా చేస్తున్నారని మాజీ మంత్రి ఆరోపించారు.

Read More  భయపడకండి... వారిని చెప్పులతో తరిమే రోజులు దగ్గర్లోనే..: నారా లోకేష్ సీరియస్

ముఖ్యమంత్రి జగన్ తన అధికారాలను అడ్డుపెట్టి బంధువులు, అనుచరులకు ప్రజాధనం దోచిపెడుతున్నాడని ఆనంద్ బాబు ఆరోపించారు. వైఎస్ జగన్ కజిన్ బ్రదర్ అనిల్ రెడ్డి దోపిడీని అడ్డుకునేవారే రాష్ట్రంలో లేకుండా పోయారన్నారు. పారదర్శకత లేకుండా టెండర్లు పిలవడం అన్యాయమని మాజీ మంత్రి మండిపడ్డారు. 

వైసిపి ప్రభుత్వం అసలు నిందితులను వదిలేసి ప్రతిదానికి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు.  ఇలా స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అన్యాయంగా మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసారు... అనంతరం రాజకీయ నాయకుల్లా ప్రెస్ మీట్ పెట్టిమరీ చందబాబును విమర్శించిన సిఐడి డిజి, ఏజి సుధాకర్ రెడ్డి అభాసుపాలయ్యారని ఆనంద్ బాబు అన్నారు. 
 

click me!